Begin typing your search above and press return to search.
రోజా కోసం టీడీపీ గొప్ప ఆఫర్
By: Tupaki Desk | 5 Jan 2017 4:44 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసిన వైసీపీ మహిళా నేత రోజాపై సాంఘిక సంక్షేమ శాఖ - గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. అవాకులు - చెవాకులతో రోజుకో విమర్శ చేస్తూ రోజా అనవసరంగా నోరు పారేసుకుంటోందని విమర్శించారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావెల కిశోర్ బాబు మాట్లాడుతూ.. ఎక్కడో యూపీలో బేదాభిప్రాయాలతో రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో నేడు రాష్ట్రంలో చంద్రబాబు-లోకేష్ కు కూడా అంతర్గత విబేధాలున్నాయంటూ రోజా నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో అహర్నిశలు కష్టపడుతున్న బాబును - పార్టీకి సమన్వయకర్తగా ఉంటున్న లోకేష్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు.
ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజా ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటుండటం చూస్తే ఆమె మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందని రావెల వ్యాఖ్యానించారు. రోజా ఏదైనా మానసిక ఆసుపత్రిలో చెక్ చేయించుకోవాలని కోరారు. ఒకవేళ ఆమె సిద్ధపడకపోతే ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద మానసిక వ్యాధికి ఉచితంగా చికిత్స చేయిస్తామని రావెల కిశోర్ బాబు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో రోజా ప్రవర్తనపై మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుందని అయినా మహిళా శాసనసభ్యురాలు అనే విషయం మరిచి, మహిళా లోకం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నోటి దురుసుతనం - వెకిలి చేష్టలతో శాసనసభ నుంచి సస్పెండ్ అయినప్పటికీ రోజా తీరులో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. స్పీకర్ కు క్షమాపణ చెప్పినప్పటికీ పాత పద్దతిలోనే ఆమె వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించడంలో, ప్రజా విశ్వాసాన్ని పొందడంలో విఫలమైన ప్రతిపక్షం ఉనికి కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని కిశోర్ బాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను విమర్శించే స్థాయి రోజాకు లేదని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి అడ్డుతగులుతూ విద్వేష రాజకీయాలకు వైసీపీ పాల్పడుతోందని రావెల ఆరోపించారు. నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అమలవుతుండటంతో ఉనికి కోల్పోతామనే భయం ప్రతిపక్ష నేతల్లో కనిపిస్తోందని అన్నారు. రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి లేని పక్షంలో ప్రజలే ఆమెకు తగిన బుద్దిచెప్తారని హెచ్చరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/