Begin typing your search above and press return to search.

టీడీపీని వీడి సంచలన వ్యాఖ్యలు చేసిన రావెల

By:  Tupaki Desk   |   1 Dec 2018 8:55 AM GMT
టీడీపీని వీడి సంచలన వ్యాఖ్యలు చేసిన రావెల
X
మాజీ మంత్రి - పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు జనసేన కండువా కప్పుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన పవన్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఖండించకపోవడం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారాయి. శనివారం ఆయన పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో అధికారికంగా చేరిపోయారు.

గంటూరు జిల్లా టీడీపీ జడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ నియోజకవర్గం కూడా పత్తిపాడు కావడంతో, ఇద్దరి మధ్య ఓ సందర్భంలో విబేధాలు పొడచూపాయి. చినికి చినికి గాలివానలా మారడం - ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టుకుని తిట్టుకోవడం కూడా జరిగింది. ఆ తరువాత ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ తరువాత ఆయన మంత్రి పదవి ఊడటం - జిల్లా కే చెందిన నక్కా ఆనందబాబుకు మంత్రి పదవిని కట్టబెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనతో ఉన్నారు.

జనసేనలో చేరిన ఎమ్మెల్యే రావెల టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి - అక్రమాలతో ఆ పార్టీ నిండిపోయిందని ధ్వజమెత్తారు. దోపిడీ పెరిగిపోయిందని - ఆత్మాభిమానం చంపుకొని ఆ పార్టీలో ఇన్నాళ్లు ఉన్నానని అన్నారు. టీడీపీలో అసలు సిద్ధాంతాలే లేవని చెప్పుకొచ్చారు. కలస్వామ్యం - దోపిడీ స్వామ్యం ఎక్కువైపోయిందని, పదవులు ఉన్నా.. పవర్స్ మాత్రం కొందరి దగ్గరే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే టీడీపీని వీడాల్సి వచ్చిందని అన్నారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ టీడీపీ అంటేనే అవకాశవాద రాజకీయాలని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా - అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ఆడపడుచులను కూడా బెదిరిస్తున్నారని - ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.