Begin typing your search above and press return to search.

ప‌త్తిపాటి బ్యాక్ గ్రౌండ్ ఇలాంటిదా?

By:  Tupaki Desk   |   5 March 2018 7:30 AM GMT
ప‌త్తిపాటి బ్యాక్ గ్రౌండ్ ఇలాంటిదా?
X
అధికారం ఉన్న చోట అంత‌ర్గ‌త పోరు త‌ప్ప‌నిస‌రి. కానీ.. ఇది అంత‌కంత‌కూ పెరిగి పార్టీ ఇమేజ్ నే డ్యామేజ్ చేసేలా ఉండ‌కూడ‌దు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి ఏపీలో క‌నిపిస్తోంది. పార్టీలో పెరుగుతున్న విభేదాల‌కు చెక్ పెట్టే విష‌యంలో చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న నాన్చుడు ధోర‌ణి ఇప్పుడు పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు తేవ‌ట‌మే కాదు.. త‌మ్ముళ్ల గుట్ల‌మ‌ట్ల‌ను సొంత పార్టీ నేత‌లే బ‌య‌ట‌పెడుతున్నారు.

కొన్ని పార్టీలు అధికారంలో ఉన్న‌ప్పుడు.. కుంభ‌కోణాల పేరుతో మీడియా ప్లే చేసే రోల్ అంతా ఇంతా కాదు. అదేం ద‌రిద్ర‌మో కానీ.. కొన్ని పార్టీలు ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు య‌థావిధిగా కుంభ‌కోణాలు జ‌రుగుతున్నా.. అస‌లు ఆ ఊసే ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం క‌నిపిస్తుంది. అంత‌ర్గత విభేదాల పుణ్య‌మా అని ఇలాంటి విష‌యాలు అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంటాయి.

తాజాగా అలాంటి గుట్టు ఒక‌టి విప్పేశారు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు అక్ర‌మ మైనింగ్ కు పాల్ప‌డుతూ త‌న ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేస్తున్నార‌ని ఆరోపించ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ఒక‌రు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఒక విష‌య‌మైతే.. ఆ దారుణాన్ని త‌ట్టుకోలేక బ‌య‌ట‌కు వెళ్ల‌గ‌క్కే వ‌ర‌కూ నిఘా వ‌ర్గాలు ఏం చేస్తున్నాయి? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌.

ఒక ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో ఒక మంత్రి అక్ర‌మ మైనింగ్‌ కు పాల్ప‌డుతున్నా వ్య‌వ‌హారాన్ని నిఘా వ‌ర్గాలు గుర్తించి ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌టం.. ఆ వెంట‌నే స‌ద‌రు నేతకు చెక్ పెట్టాల్సింది పోయి.. చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. ఇష్టారాజ్యంగా సాగుతున్న బ‌రితెగింపును సొంత‌పార్టీ నేతే బ‌య‌ట‌పెట్ట‌టం సంచ‌ల‌నంగా మారింది.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అక్ర‌మ మైనింగ్ గురించి మంత్రి ప‌త్రిపాటిని తాను హెచ్చ‌రించినా ఫ‌లితం లేకుండా పోయింద‌న్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఓబుల‌నాయుడు పాలెంలో అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతుంద‌ని.. ఆయ‌న‌కు అక్క‌డి వారు వాటా పంపుతున్నార‌ని.. దీని కార‌ణంగా త‌న‌కు చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని ప‌త్తిపాటికి చెప్పినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌న్నారు.

ఈ వ్య‌వ‌హారంలో త‌న ఇమేజ్ డ్యామేజ్ అయ్యింద‌ని రావెల వాపోతున్నారు. అస‌లేం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు మీడియాను తీసుకెళ్లిన త‌న‌కు య‌ధేచ్ఛ‌గా అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతున్న తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింద‌న్నారు.త‌న‌పార్టీకి చెందిన మాజీ మంత్రి ఇంత ఓపెన్ అయ్యాక అయినా బాబు చ‌ర్య‌లు తీసుకుంటారా? త‌న‌కేం వినిపించ‌న‌ట్లుగా ఉండిపోతారా?