Begin typing your search above and press return to search.
బాబుపై రావెల రివెంజ్ తీర్చుకుంటున్నారా?
By: Tupaki Desk | 7 July 2017 7:02 AM GMTరాజకీయంగా ఒక్కసారిగా పైకెదిగి అంతేవేగంగా డౌనైపోయిన రావెల కిశోర్ బాబు మంత్రి పదవి పోయిన తరువాత కొన్నాళ్లుగా సైలెంటుగా ఉన్నారు. ఇప్పుడాయన చంద్రబాబుకు తలనొప్పులు తేవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టిక్కెట్ సంపాదించి, అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న ఈ దళిత నేత ఆ తరువాత అనేక వివాదాలతో అన్ పాపులర్ అయ్యారు. దీంతో చంద్రబాబు ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించారు. అలాంటి రావెల ఫొటోలు ఇప్పుడు మాదిగ కురుక్షేత్ర మహాసభ పోస్టర్లలో కనిపిస్తున్నాయి.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ తో చంద్రాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మాదిగ కురుక్షేత్ర మహాసభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు - కృష్ణాజిల్లాలో దీనిపై పెద్దపెద్ద పోస్టర్లు పెట్టారు. బతికున్న మాదిగవైతే కురుక్షేత్ర మహాసభకు తరలి..రా! నినాదంతో ఎమ్మార్పీఎస్ నేతల పేరిట ఫ్లెక్సీలు - పోస్టర్లు వెలిశాయి. వాటిలో మాజీమంత్రి - ప్రత్తిపాడు టిడిపి ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు ఫొటో కూడా ముద్రించటంతో రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది.. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ మహాసభ నిర్వహణ వెనుక రావెల అండదండలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే రావెల మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో అభిమానులు - కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తే తప్పేమిటని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. గత కొద్దినెలల క్రితం మంత్రివర్గ విస్తరణ సందర్భంగా రావెలకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో ఆయన చంద్రబాబుపై కోపంగా ఉన్నారని.. అందుకే ఈ సభకు ప్లాన్ చేశారని అంటున్నారు. అదేసమయంలో ఆయన వైసీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని టీడీపీ అనుమానిస్తోంది. ఆయన వైసీపీలో చేరొచ్చని కూడా అంటున్నారు. అదంతా ఎలా ఉన్నా ఈ సభ వెనుక రావెల ఉన్నారని మాత్రం బలంగా వినిపిస్తోంది.