Begin typing your search above and press return to search.
రాక్ స్టార్ అవతారమెత్తిన ఏపీ మంత్రి!
By: Tupaki Desk | 16 Aug 2016 3:57 AM GMTస్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొనే నాయకులు సాదారణంగా చేసే పని జెండా ఎగురవేయడం - అనంతరం ఉపన్యాశాలు చేయడం. నూటికి 99శాతం స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా జరిగేది ఇదే. అయితే తాజాగా జరిగిన 70వ స్వాతంత్ర దినొత్సవ వేడుకల్లో ఏపీ మంత్రి ఒకరు రాక్ స్టార్ అవతారం ఎత్తారు. చేతిలో గిటార్ పట్టుకుని, నెత్తిన టోపీ పెట్టుకుని డాన్సు చేశారు. రాష్ట్ర మంత్రి ఉన్నట్లుండి రాక్ స్టార్ అవతారం ఎత్తడంపై అంతా ఆశ్చర్యపోయారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రామకృష్ణాపురంలో జరిగిన 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. ఈ సమయంలో స్థానిక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలోని గిటార్ ను తీసుకున్న రావెల.. దానిని వాయిస్తూ అందర్నీ అలరించారు. దీంతో స్థానిక ప్రజలంతో ఆశ్చర్యంలో మునిగిపోగా.. మరికొందరు డాన్సులు కూడా చేశారు. గిట్టార్ వాయించడం పూర్తయిన తర్వాత విద్యార్థులతో కలసి డ్యాన్స్ చేసి అదరగొట్టిన రావెల.. తనకున్న మరో టాలెంట్ ని అలా చూపించారు. పాఠశాలల్లో ఈ తరహా సాంస్కృతిక కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ఉల్లాసం - ఉత్సాహం పెరుగుతాయని చెప్పిన రావెల.. ఇది విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపారు.
కాగా గతంలో కూడా గుంటూరు జిల్లా కైట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన యువ - 2016 కార్యక్రమానికి విచ్చేసిన సమయంలో కూడా రావెల గిటార్ వాయిస్తూ.. కాలేజీ పిల్లలను ఉత్సాహ పరిచిన సంగతి తెలిసిందే.