Begin typing your search above and press return to search.
మంత్రి రావెల హ్యాండ్సప్
By: Tupaki Desk | 5 March 2016 11:53 AM GMT ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ఇబ్బందుల్లో పడిపోయారు. మంత్రి పదవి చేతిలో ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. హైదరాబాద్ ఇప్పుడు పరాయి రాష్ట్రంలో ఉండడంతో ఏపీ మంత్రిగా ఆయన అక్కడ చక్రం తిప్పలేక, కొడుకును కేసుల నుంచి తప్పించలేక చేతులెత్తేశారు. ఇక తనవల్ల కాదన్న ఉద్దేశంతోనే ఆయన కొడుకు కేసులో జోక్యం చేసుకోబోనంటూ పెద్దమనిషి తరహా మాటలకొచ్చేశారు.
శనివారం రావెల మాట్లాడుతూ తన కుమారుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిర్భయ కేసు నమోదైందని స్పష్టం చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి నేరం జరిగిందో లేదో తేలుస్తారని చెబుతూ ఏం జరిగితే అది జరుగుతుందంటూ నిర్వేదం వ్యక్తంచేశారు. తనకు రాజ్యాంగం - చట్టం పట్ల నమ్మకం - విశ్వాసం ఉందని చెప్పిన ఆయన తప్పు ఎవరు చేసినా తప్పేనన్నారు.
కాగా.. మంత్రి తనయుడు సుశీల్ హైదరాబాద్ లో మహిళను వెంటాడినట్లు, చేయిపట్టి కారు లోపలికి లాగే ప్రయత్నం చేసినట్లు సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారాలు పోలీసులు సంపాదించారు. దీంతో ఆయనపై పెట్టిన కేసు బిగుసుకోనుంది. పరారీలో ఉన్న సుశీల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏపీలో గాలించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.