Begin typing your search above and press return to search.
లొంగిపోయిన `క్రిమినల్ పోలీస్`
By: Tupaki Desk | 20 Oct 2017 9:08 AM GMTరాష్ట్ర పోలీస్ వర్గాల పరువు తీసేసిన క్రమినల్ డీఎస్పీ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులను ``ఖాకీ అని సంబోధించవద్దు. వారు త్యాగనిరతికి ప్రతీకలు`` అంటూ డీజీపీ సాంబశివరావు మీడియాకు క్లాస్ పీకిన మరుసటి రోజే ఈ క్రమినల్ డీఎస్పీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన ఎదుగుదల కోసం ఓ ఎమ్మెల్యే కూతురు - ఎంపీపీతో సెక్స్ సంబంధం పెట్టుకున్న డీఎస్పీ రవిబాబు.. తర్వాత ఆమెతో ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి పక్కకు పెట్టడంతో మొదలైన వివాదం ఒక హత్యకు దారితీయగా - ఈ హత్య మరో హత్యకు ఉసిగొల్పింది. ఇలా చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసే.. ఇష్టానుసారం ప్రవర్తించి క్రిమినల్ గా లొంగిపోయాడు.
రౌడీ షీటర్ గేదెల రాజు హత్య కేసులో డీఎస్పీ రవిబాబు చోడవరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. దీంతో రెండు మర్డర్ కేసులపై స్పష్టత వచ్చింది. పదేళ్ల క్రితం చోడవరంలో రవిబాబు సీఐగా పని చేశాడు. అప్పట్లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా కాకర్ల నూకరాజు పనిచేసేవారు. ఈ క్రమంలో రవిబాబు ఆయన కుమార్తె - దివంగత పద్మలతతో సన్నిహితంగా ఉండేవారు. ఇలా ఉంటే తనకు డిపార్ట్ మెంట్ లో మంచి హోదాతో ప్రమోషన్ వస్తుందని - తనకు తిరుగుండదని భావించాడు. అయితే, తర్వాత జరిగిన ఎన్నికల్లో నూకరాజు ఓడిపోవడంతో ఈయన పద్మలతని పక్కకు పెట్టాడు. దీంతో ఆమె తనను వివాహం చేసుకుంటానని మోసం చేశాడంటూ 2016లో పోలీసు ఉన్నతాధికారులకు రవిబాబుపై ఫిర్యాదు చేసింది.
దీంతో తన బండారం బయటపడుతుందని భావించిన రవిబాబు.. ఆమెను హత్య చేయించాలని ప్లాన్ వేసి - కోటి రూపాయలకు ఎమ్మెల్యే కుటుంబానికి సన్నిహితుడైన రౌడీ షీటర్ గేదెల రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమె కొన్నాళ్లకే మరణించింది. ఈ క్రమంలో ఆమెను హత్య చేసినందుకు రాజుకి 50 లక్షల రూపాయలను రవిబాబు అందజేశారు. అయితే ఒప్పందం ప్రకారం మిగిలిన 50 లక్షల రూపాయలు ఇవ్వాలని రవిబాబును రాజు డిమాండ్ చేస్తుండేవాడు. అంతే కాకుండా, ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయి రవిబాబు అన్న విషయాన్ని బయటపెడతానని బెదిరింపులకు దిగేవాడు.
దీంతో రాజుతో ఎప్పటికైనా ప్రమాదమని గుర్తించిన రవిబాబు - మరొక కిరాయి హంతక ముఠాతో ఒప్పందం చేసుకుని క్షత్రియ భేరి భవనంలో రాజును హత్య చేయించాడు. అనంతరం ఈ కేసులో నిందితులు వరుసగా అరెస్టు కావడంతో 'ఏ వన్' ముద్దాయి పెందుర్తి డీఎస్పీ రవిబాబు అని తేలింది. దీంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన చోడవరం పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. ఇక, ఇప్పుడు ఈయన తన పోలీస్ కెరీర్ లో ఇవే చేశాడా? మరిన్నిఅకృత్యాలకు పాల్పడ్డాడా? అన్నది తేలాల్సి ఉంది.