Begin typing your search above and press return to search.

వాళ్లను ఉరి తీయటానికి రెఢీ అంటున్నాడు

By:  Tupaki Desk   |   5 Dec 2019 4:57 AM GMT
వాళ్లను ఉరి తీయటానికి రెఢీ అంటున్నాడు
X
యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసి.. కంట నీరు తెప్పించిన ఉదంతంగా నిర్భయది చెప్పాలి. పారా మెడికల్ విద్యార్థినిగా ఉన్న ఆమెపై పశువుల కంటే హీనంగా ప్రవర్తించిన దోషులకు ఉరిశిక్షను విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి చాలాకాలమే అయ్యింది. అయినప్పటికీ ఇప్పటివరకూ వారిని ఉరి తీసింది లేదు.

దీనికి కారణం ఏమిటన్నది చూస్తే.. నిర్భయ హంతకుల్ని ఉరి తీసేందుకు కావాల్సిన తలారి లేకపోవటమని చెబుతున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న వీరిని ఉరి తీసేందుకు తలారీ లేకపోవటంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తల పట్టుకుంటున్నారు.

ఇలాంటివేళ.. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి ముందుకు వచ్చారు. తనను తాత్కాలికంగా తలారీ ఉద్యోగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మనదేశంలో ఎప్పుడో ఒకసారి తప్పించి తరచూ ఉరిశిక్షలు అమలు కావు. యూపీఏ హయాంలో అఫ్జల్ గురును ఉరి తీసిన తర్వాత ఇప్పటివరకూ మరెవరినీ ఉరి తీయలేదు. ఈ నేపథ్యంలో ఉరి తీసేందుకు ఉద్యోగుల్ని అప్పటికప్పుడు కాంట్రాక్టు బేసిస్ లో నియమిస్తుంటారు.

ఇలాంటివేళ.. నిర్భయ దోషులకు విధించిన ఉరిని అమలు చేయలేకపోవటానికి కారణం.. తలారీ లేకపోవటమేనన్న మీడియా వార్తల్ని చూసిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి రాష్ట్రపతి కోవింద్ కు ఒక లేఖ రాశారు.తనను తలారీగా ఎంపిక చేస్తూ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కోరారు. నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్షను వెంటనే అమలు చేయటం ద్వారా నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాకు చెందిన రవికుమార్ పేర్కొన్నారు. మరి.. దీనికి రాష్ట్రపతి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.