Begin typing your search above and press return to search.
సుప్రీం తీర్పు ఎఫెక్ట్.. పోలీసుల ముందుకు రవి ప్రకాశ్
By: Tupaki Desk | 4 Jun 2019 1:50 PM GMTదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు మేరకు ప్రముఖ న్యూస్ చానెల్ టీవీ9 వ్యవస్థాపక అధ్యక్షుడు రవి ప్రకాశ్ అజ్ఞాతాన్ని వీడారు. సొంత ప్రయోజనం కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారంటూ ప్రస్తుత యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కనిపించకుండా పోయిన ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. రవి ప్రకాశ్ తన తరపు న్యాయవాదులను వెంట పెట్టుకుని నగరంలోని సైబర్ క్రైమ్ కార్యాలయానికి వచ్చారు. దీంతో పోలీసులు ఆయన నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, పోలీసుల విచారణకు రవి ప్రకాశ్ సహకరిస్తున్నారా..? లేదా..? అనేది మాత్రం తెలియడం లేదు.
ఇదిలా ఉండగా, ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లిన రవి ప్రకాశ్ కు సోమవారం చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని టీవీ9 మాజీ సీఈవోకు సుప్రీం కోర్టు సూచించింది. అదే సమయంలో బెయిల్ పిటిషన్ పై మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అలాగే ఈ నెల 10 రవి ప్రకాశ్ ముందస్తు బెయిల్‌పై సరైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టుకు చెప్పింది. అంతేకాదు - 41ఏ నోటీసు కింద విచారణకు హాజరుకావాలని రవిప్రకాష్ ను కూడా ఆదేశించింది. దీనితో పాటు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలిపై సుప్రీం కీలక సూచనలు చేసింది. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది.
సుప్రీం ఇచ్చిన తీర్పుతో ఎలాగైనా పోలీసుల ముందు హాజరు కావాల్సి రావడంతో రవి ప్రకాశ్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అలంద మీడియాను మోసగించిన కేసులో విచారణకు హాజరుకావాలని రవి ప్రకాశ్ కు పోలీసులు ఎప్పుడో నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో ఇప్పటికే పోలీసులు రెండు సార్లు సీఆర్పీసీ సెక్షన్ల 160 - 41(ఎ) కింద నోటీసులు జారీ చేశారు. అలాగే లుక్ అవుట్ నోటీసులతో పాటు విమానాశ్రయాలు - నౌకాశ్రయాలను అలర్ట్ చేశారు. అయితే పోలీసుల ముందు విచారణకు హాజరుకాకుండా న్యాయవాదుల సహకారంతో రవి ప్రకాశ్ కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చారు. రవి ప్రకాశ్ మీద తెలంగాణ పోలీసులు మూడు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.