Begin typing your search above and press return to search.

విచార‌ణ‌లో పోలీసుల్ని బెదిరించిన ర‌విప్ర‌కాశ్‌?

By:  Tupaki Desk   |   8 Jun 2019 4:11 AM GMT
విచార‌ణ‌లో పోలీసుల్ని బెదిరించిన ర‌విప్ర‌కాశ్‌?
X
నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటూ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే వారు ఒద్దిక‌గా.. ప‌ద్ద‌తిగా ఉండ‌ట‌మే కాదు.. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన‌ట్లుగా వారి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అదే స‌మ‌యంలో ఒత్తిడిని ఎదుర్కోవ‌టం తెలిసిందే. అందుకు భిన్నంగా టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు.

ప‌లు నేరారోప‌ణ‌లున్న ఆయ‌న‌.. విచార‌ణ‌కు నోటీసులు ఇచ్చిన 27 రోజుల పాటు క‌నిపించ‌కుండా పోవ‌టం తెలిసిందే. ఆయ‌న కోసం బృందాల వారీగా పోలీసులు గాలింపు జ‌రిపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలీసుల‌కు చిక్క‌కుండా నేరుగా సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ కు వ‌చ్చిన ఆయ‌న త‌న‌ను విచారిస్తున్న పోలీసుల‌కు షాకిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ముందుగా సిద్ధం చేసుకున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌ని ఆయ‌న‌.. ప్ర‌తి ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని దాట‌వేసే ధోర‌ణిలో బ‌దులిచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. న‌న్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏదో ఒక రోజు మీకు టైం వ‌స్తుంది అంటూ విచార‌ణ చేస్తున్న పోలీసుల‌ను ఉద్దేశించి ర‌విప్ర‌కాశ్ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. విచార‌ణ సంద‌ర్భంగా ర‌విప్ర‌కాశ్ తీరు పోలీసు వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోందని తెలుస్తోంది.

సైబ‌రాబాద్ పోలీసుల‌తో పాటు.. శుక్ర‌వారం బంజారాహిల్స్ పోలీసుల విచార‌ణ‌లోనూ ర‌విప్ర‌కాశ్ త‌న‌దైన శైలితో పోలీసుల‌ను ఇబ్బంది పెట్టిన‌ట్లుగా స‌మాచారం. టీవీ 9 కొత్త యాజ‌మాన్యాన్ని ఇబ్బందులు పెట్టాల‌ని కుట్ర ప‌న్నారా? అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న నుంచి మౌన‌మే స‌మాధానంగా మారింద‌ని చెబుతున్నారు. లోగోను ఎందుకు అమ్మార‌న్న ప్ర‌శ్న‌కు.. అది నా సంస్థ‌.. ఆ హ‌క్కు నాకుంద‌న్న మాట ర‌విప్ర‌కాశ్ నోటి నుంచి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి బ‌దులుగా పోలీసులు స్పందిస్తూ.. రూ.100 కోట్ల విలువైన సంస్థ లోగోను కేవ‌లం రూ.99వేల‌కే అమ్మారంటే న‌మ్మ‌వ‌చ్చా? అని ప్ర‌శ్నించ‌గా.. తాను ఎవ‌రికీ అమ్మ‌లేదంటూ ర‌విప్ర‌కాశ్ త‌ప్పించుకునే రీతిలో బ‌దులిచ్చార‌ని చెబుతున్నారు. ఆయ‌న స‌మాధానాలు చెబుతున్న తీరుకు పోలీసులు విసిగిపోయిన‌ట్లుగా తెలుస్తోంది.