Begin typing your search above and press return to search.
రవిప్రకాష్ వాట్ నెక్ట్స్.. అరెస్టేనా?
By: Tupaki Desk | 15 May 2019 6:15 AM GMTటీవీ9 చానెల్ లో సీఈవో గా ఇన్నాళ్లు చక్రం తిప్పిన రవిప్రకాష్ కథ కంచికి చేరింది. టీవీ9ను టేకోవర్ చేసిన అలంద మీడియా సంస్థ తమకు కొరకరాని కొయ్యగా మారిన రవిప్రకాష్ ను సాగనంపింది. అంతేకాదు.. అతడు ఫోర్జరీ సహా డేటా చౌర్యం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో టీవీ9 సీఈవో పోస్టు పోయి.. ఇప్పుడు కేసులు చుట్టముట్టడంతో రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నారన్న విషయం తెలియడం లేదు. ప్రస్తుతం ఈ కేసులను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై లాయర్లతో చర్చిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. లాయర్లతో కలిసి కోర్టులో లొంగిపోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బెయిల్ తీసుకొని బయటపడాలని భావిస్తున్నట్టు సమాచారం.
*అమరావతా.? ముంబైనా.?
అయితే రవిప్రకాష్ అమరావతిలో ఉన్నాడని కొందరు.. కాదు కాదు.. ముంబైలో రియలన్స్ అధినేత ముఖేష్ తో చర్చలు జరుపుతున్నాడని కొందరు అంటున్నారు. రిలయన్స్ కు చెందిన టీవీ18ను తెలుగులో లాంచ్ చేసి దాని బాధ్యతలు చేపట్టే పనిలో బిజీగా ఉన్నాడని కొందరు ప్రచారంలోకి తెచ్చారు. అయితే ఎక్కడున్నాడన్నది మాత్రం తెలియడం లేదు..
*ఈరోజే లాస్ట్.. లేదంటే అరెస్టే..
అయితే ఇప్పటికే రవిప్రకాష్ కు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఆయన విచారణకు రాకపోయేసరికి తాజాగా సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు హాజరుకాకపోతే రవిప్రకాష్ చాప్టర్ క్లోజే. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశాలున్నాయట.. ఇప్పటికే రవిప్రకాష్ ఉనికిపై ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు.. ఈరోజు గడిస్తే ఆయనను అరెస్ట్ చేయడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.
*రవిప్రకాష్ భవిష్యత్ ఏంటీ.?
రవిప్రకాష్ టీవీ9 సీఈవోగా ఉండగానే భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఆయన సొంతంగా మోజీ టీవీని స్థాపించి మెజార్టీ పెట్టుబడులు పెట్టారట.. ఇదే కాకుండా పలు వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు రవిప్రకాష్ కు ఉన్నాయంటున్నారు. అదేకాదు.. టాలీవుడ్ లో ప్రముఖ ఈవెంట్ల సంస్థల్లో వాటాలున్నాయట.. ఇదేకాదు.. తాజాగా ఐ న్యూస్ ను టేకోవర్ చేసే పనిలో రవిప్రకాష్ ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.
*ముందు కేసుల సంగతి తేలాకే..
రవిప్రకాష్ మళ్లీ మీడియాలో హైలెట్ కావాలంటే ముందు ఆయన కేసుల నుంచి బయటపడాలి. టీవీ18 అయినా మోజీ, ఐన్యూస్ ల బాధ్యత నిర్వహించాలన్నా ఆయన ఫోర్జరీ - డేటాచోరీల కేసు నుంచి బయటపడాలి. కానీ అదంతా సాధ్యం కాదని లాయర్లు స్పష్టం చేస్తున్నారు. ఆధారాలు బలంగా ఉండడంతో రవిప్రకాష్ బయటపడడం కష్టమంటున్నారు. మరి రవిప్రకాష్ భవిష్యత్ ఏంటన్న ఉత్కంఠ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.