Begin typing your search above and press return to search.

త‌న అడ్ర‌స్ తానే ఇచ్చేసిన ర‌విప్ర‌కాశ్‌!

By:  Tupaki Desk   |   17 May 2019 6:36 AM GMT
త‌న అడ్ర‌స్ తానే ఇచ్చేసిన ర‌విప్ర‌కాశ్‌!
X
టీవీ9 ఎపిసోడ్ లో ఆ చాన‌ల్ మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ మీద ప‌లు సెక్ష‌న్ల మీద కేసులు న‌మోదు కావ‌టం ఒక ఎత్తు.. తాజాగా ఆరు లోగులు రూ.99వేల‌కు త‌న సొంత కంపెనీకి అమ్మేసిన ఉదంతం వెలుగుచూడ‌టం సంచ‌ల‌నంగా మారింది. ర‌విప్ర‌కాశ్ మీద మోసం.. ఫోర్జ‌రీ త‌దిత‌ర నేరాల‌కుసంబంధించిన ఫిర్యాదుల నేప‌థ్యంలో ఆయ‌న్ను పోలీసుల ఎదుట హాజ‌రు కావాలంటూ సైబ‌రాబాద్ పోలీసులు ఇప్ప‌టికే ప‌లుమార్లు నోటీసులు ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. త‌మ నోటీసుల‌కు స్పందించ‌ని ర‌విప్ర‌కాశ్ ఆచూకీ కోసం సైబ‌రాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. ఆయ‌న ఎక్క‌డున్నార‌న్న స‌మాచారం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ర‌విప్ర‌కాశ్ చేసిన ఒక ప‌ని ఆయ‌న ఎక్క‌డున్న విష‌యాన్ని చెప్పేసింద‌న్న మాట సైబ‌రాబాద్ పోలీసు వ‌ర్గాల్లో వినిపిస్తోంది.
పోలీసులు ఇచ్చిన నోటీసుల నేప‌థ్యంలో వాటికి బ‌దులిచ్చే క్ర‌మంలో బుధ‌వారం ఒక ఈమొయిల్ ను పంపిన విష‌యం తెలిసిందే. ఈ ఈ-మొయిల్ ద్వారా ఆయ‌న ఎక్క‌డ నుంచి దీన్ని పంపార‌న్న విష‌యాన్ని క్రాక్ చేసే ప‌నిలో పోలీసులు ప‌డినట్లు చెబుతున్నారు. తాను విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని.. మ‌రో ప‌ది రోజుల స‌మ‌యం ఇవ్వాల‌ని చెప్పిన ర‌విప్ర‌కాశ్‌.. అందుకు సంబంధించిన ఈ-మొయిల్ ను సైబ‌రాబాద్ పోలీసుల‌కు పంపారు. ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఈమొయిల్ పంపిన కంప్యూట‌ర్ ఐపీ నెంబ‌ర్ ఏమిటి? అన్న విష‌యాల‌పై దృష్టి పెట్టిన పోలీసులు.. ర‌విప్ర‌కాశ్ ఎక్క‌డున్న విష‌యాన్ని గుర్తించిన‌ట్లుగా తెలుస్తోంది.

రవిప్ర‌కాశ్ ఆచూకీని గుర్తించిన పోలీసులు.. ఆ స‌మాచారాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసుకుంటున్న‌ట్లుగా స‌మాచారం. వీలైనంత త్వ‌ర‌గా అదుపులోకి తీసుకోవాల‌ని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకుంటే మాత్రం అరెస్ట్ త‌ప్ప‌ద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు పోలీసు అధికారులు వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కాలం తానెక్క‌డున్న స‌మాచారం బ‌య‌ట‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డిన ఆయ‌న‌.. ఇప్పుడు త‌న ఈ -మొయిల్ తో తానెక్క‌డ ఉంద‌న్న విష‌యాన్ని చెప్పేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.