Begin typing your search above and press return to search.

ర‌విప్ర‌కాశ్ మిస్ అయిన లాజిక్ ఇదే!

By:  Tupaki Desk   |   11 May 2019 4:55 AM GMT
ర‌విప్ర‌కాశ్ మిస్ అయిన లాజిక్ ఇదే!
X
పెద్ద‌పెద్దోళ్లు చేసే చిన్న చిన్న త‌ప్పులు చూస్తే.. ఈ మాత్రం తెలీదా? అన్న క్వ‌శ్చ‌న్ మెద‌డును తొలిచేస్తుంటుంది. స‌మాజాన్ని మార్చేద్దాం.. మెరుగైన స‌మాజాన్ని నిర్మిద్దాం మొద‌లు.. ఎన్నో నీతులు చెబుతూ.. తాను కోరుకున్న స‌మాజం ఎలా ఉండాల‌న్న విష‌యాన్ని టీవీ 9 ఛాన‌ల్ తో దాదాపు ప‌దిహేనేళ్ల నుంచి తెలుగు వాకిళ్ల‌లో రీసౌండ్ రేంజ్లో మారుమోగిన ర‌విప్ర‌కాశ్.. ఇప్పుడిలాంటి ప‌రిస్థితుల్లో త‌న బ్రెయిన్ ఛైల్డ్ ను వ‌దిలివెళ్లాల్సిన ప‌రిస్థితి రావ‌ట‌మా? అంటూ కొంద‌రు భావోద్వేగంగా రియాక్ట్ అవుతున్నారు.

ఎమోష‌న్స్ ను ప‌క్క‌న పెట్టి.. ప్రాక్టిక‌ల్ గా ఆలోచించిన‌ప్పుడు.. చాలా చిన్న లాజిక్ ను ర‌విప్ర‌కాశ్ మిస్ అయ్యార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ముత్తాత‌ల ఆస్తి అయినా.. ఎన్నో త‌రాల నుంచి వ‌స్తున్న‌ప్ప‌టికీ.. ఎవ‌రైనా దాన్ని సొంతం చేసుకున్న త‌ర్వాత‌.. ఆ ఆస్తితో త‌మ‌కున్న బంధం మొత్తం తెగ‌తెంపులైపోతుంది. గ‌తం ఒక గురుతు మాత్ర‌మే త‌ప్పించి.. సొంతం కాద‌న్న వ‌ర్త‌మాన వాస్త‌వాన్ని గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది.

కానీ.. టీవీ9 విష‌యంలో ర‌విప్ర‌కాశ్ మిస్ అవుతున్న చిన్న లాజిక్ ఇదే. 90శాతానికి పైగా వాటాను సొంతం చేసుకున్న వారి చేతికి త‌న ఛాన‌ల్ ను అప్ప‌జెప్ప‌కుండా ఉండ‌టాన్ని.. మెరుగైన స‌మాజం అంటూ నీతులు చెప్పే ర‌విప్ర‌కాశ్ లాంటోళ్లు చేయ‌టాన్ని ఎవ‌రూ హ‌ర్షించ‌లేక‌పోతున్నారు.

నిజంగానే టీవీ9 మీద అంత ప్రేమే ఉంటే.. వంద‌లాది కోట్ల ఆస్తి ఉంద‌ని చెప్పే ర‌విప్ర‌కాశ్ ఎందుకు సొంతం చేసుకోలేక‌పోయార‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఒక‌వేళ అదంతా ఉత్త మాట‌లే త‌ప్పించి.. నిజంగా నా ద‌గ్గ‌ర అంత ఆస్తి లేద‌ని ర‌విప్ర‌కాశ్ అండ్ కో చెప్పార‌నే అనుకుందాం.. తెలుగు నేల మీద టీవీ9ను కొనుగోలు చేసే స‌త్తా ఉన్నోళ్లు ర‌విప్ర‌కాశ్ కు క‌నిపించ‌కుండా పోయారా? త‌న‌కు న‌చ్చినోళ్లు.. త‌న‌ను మెచ్చినోళ్ల చేత కొనుగోలు చేయిస్తే.. ఎప్ప‌టికి టీవీ9 తాను చెప్పిన‌ట్లే ఉండేది క‌దా? అది వ‌దిలేసి.. అడ్డ‌దారిలో వ‌చ్చారు.. దొంగ దారిన టీవీ9లోకి ప్ర‌వేశించార‌న్న మాట‌లు ఏ మాత్రం హ‌ర్ష‌ణీయం కాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

అధికారికంగా.. చ‌ట్ట‌బ‌ద్ధంగా కొనుగోలు ప్ర‌క్రియ పూర్తి అయ్యాక‌.. కొనుగోలుదారుల‌కు వారు కొన్న సొత్తును సొంతం చేయాల్సిన బాధ్య‌త ర‌విప్ర‌కాశ్ కు ఉంద‌న్న చిన్న లెక్క‌ను ఆయ‌న మిస్ కావ‌టం ఏమిటి? చేజారిన సొత్తు తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఒక‌ట్రెండు శాతం ఉంటుంది. కానీ.. అధికారికంగా సొంతం చేసుకున్నోడిని కాద‌ని.. ఆ సొత్తు నాదేన‌న్న అరుపులు త‌న ఇమేజ్ ను మ‌రింత డ్యామేజ్ చేస్తాయ‌న్న చిన్న విష‌యం ర‌విప్ర‌కాశ్ ఎందుకు మిస్ అవుతున్నట్లు?