Begin typing your search above and press return to search.

పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న రవిప్రకాష్

By:  Tupaki Desk   |   8 Jun 2019 8:00 AM GMT
పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న రవిప్రకాష్
X
జర్నలిస్టుగా దాదాపు 20 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాడు.. పైగా భీకర జర్నలిస్టు.. రవిప్రకాష్ దేశంలోని నేతలు, మేధావులను కూడా చాలా సార్లు తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయగల మేధావి. అంతటి శక్తిసామర్థ్యాలున్న జర్నలిస్టు ఇప్పుడు తనను విచారిస్తున్న పోలీసులకే చుక్కలు చూపిస్తున్నట్టు సమాచారం.. గంటల కొద్దీ పోలీసులు విచారిస్తున్నా వారిని విసిగిస్తూ తెలివిగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ తప్పించుకుంటుండడం పోలీసులకు తలకు మించిన భారం అవుతోందట..

తాజాగా బంజారాహిల్స్ పోలీసులు ఫోర్జరీ, డేటాచోరీ, టీవీ9 లోగో విక్రయం విషయంలో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను దాదాపు 7 గంటల పాటు విచారించారు. అయితే విచారణ సమయంలో రవిప్రకాష్ పొంతన లేని సమాధానాలు చెప్తూ చాకచక్యంగా తప్పించుకుంటూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు.

దీంతో శనివారం రవిప్రకాష్ కు విచారించడానికి పోలీసులు కంపెనీ డ్యాక్యుమెంట్లను తీసుకురావాలని కోరారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు, ఇన్ స్పెక్టర్ కళింగ్ రావుల బృందం రవిప్రకాష్ ను విచారించగా.. టీవీ9 నా సంస్థ అని.. నేను పెట్టిన ఆ సంస్థపై నాకు హక్కు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. టీవీ9 లోగో విక్రయానికి సంబంధించి రవిప్రకాష్ పోలీసుల విచారణలో వారికే చుక్కలు చూపించినట్టు తెలిసింది. శనివారం పూర్తి డాక్యుమెంట్లతో రావాలని పోలీసులు రవిప్రకాష్ కు సూచించారు.

రవిప్రకాష్ విచారణకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్ట్ చేసే దిశగా పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు న్యాయ నిపుణులతో సంప్రదించి అరెస్ట్ పై శనివారం నిర్ణయం తీసుకోనున్నారు.