Begin typing your search above and press return to search.
రవిప్రకాష్ బహిరంగ లేఖ..బోర్డు సభ్యులపై నిప్పులు
By: Tupaki Desk | 10 May 2019 2:04 PM GMTటీవీ9లో మేనేజ్ మెంట్ వ్యవహారం అనేక మలుపులు తిరిగి సీఈవో రవిప్రకాశ్ ను తొలగించే వరకు చేరిన సంగతి తెలిసిందే. ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డు హైదరాబాద్ లో సమావేశమై రవి ప్రకాష్ ను టీవీ9 సీఈవో పదవి నుంచి తొలగిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించారు. మహేంద్ర మిశ్రాను టీవీ9కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్ గా ఉన్నారు. అలాగే గొట్టిపాటి సింగారావు.. గతంలో మా టీవీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం 10 టీవీ సీఈవోగా ఉన్నారు. ఈ ఎపిసోడ్ పై రవిప్రకాష్ స్పందించారు. ఓ బహిరంగ లేఖ విడుదల చేసి తన స్పందన తెలియజెప్పారు.
ఈ బహిరంగ లేఖలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లపై రవిప్రకాష్ మండిపడ్డారు. దొడ్డిదారిన వచ్చారంటూ ఆరోపణలు గుప్పించారు. అసలుడైరెక్టర్ల మీద కేసులు పెట్టించారని - తప్పుడు కేసులతో తనను వేదించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మీరెన్ని అక్రమాలు - అన్యాయాలు - చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా నేను మీ సాటి షేర్ హోల్డర్ గా - సంస్థలో నా వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటాను అని ప్రకటించి తన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో రవిప్రకాష్ చెప్పకనే చెప్పారు. ఇది రవిప్రకాష్ లేఖ.
10 మే 2019
సాయంత్రం 6 గంటలు
TO
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్,
అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎబిసిఎల్),
97 - రోడ్ నెం: 3 - బంజారాహిల్స్,
హైదరాబాద్ 500034
విషయం : tv9 గ్రూప్ ఛానల్స్ సిఈఓ పదవి నుంచి రాజీనామా. తప్పుడు కేసులు బనాయించడం - యాజమాన్యాన్ని వేధించడంపై నిరసన.
వెనుకదారిలో అక్రమంగా ప్రవేశించిన బోర్డు సభ్యులకు,
నేను.. రవిప్రకాష్.. tv9 వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజీనామా చేసే ముందు ఈ అంశాల్ని మీ ముందు ఉంచుతున్నాను.
మీరు రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే tv9 పని పట్టాలని ఈ చర్యలకు దిగారు.
అసత్యాలతో మోసగించి - వెనుక దారిలో tv9 సంస్థలోకి జొరబడ్డారు.
ఎన్ సిఎల్ టి కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు ప్రారంభించారు.
ఓ ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఎబిసిఎల్ అసలు డైరెక్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారు.
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో అక్రమ మార్గం ద్వారా నలుగురు డైరెక్టర్లను చొప్పించి పోలీసుల సహాయంతో tv9 ని కంట్రోల్ లోకి తీసుకున్నారు.
తప్పుడు కంప్లయింట్స్ తో - తప్పుడు కేసులతో నన్ను వేధించే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేశారు.
పోలీసులను యధేచ్చగా వినియోగించి నా మీద అర్థం పర్థం లేని కేసులు వేసి మీ చేతుల్లోని మీడియాలో అసత్య ప్రచారం చేశారు.
నాతో పనిచేసే వారిని వేధించి, పోలీసుల దాడులకు గురి చేసి భయోత్పాతానికి గురి చేసి బలవంతంగా కంపెనీ స్వాధీనం చేసుకున్నారు.
మీరెన్ని అక్రమాలు - అన్యాయాలు - చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా నేను మీ సాటి షేర్ హోల్డర్ గా - సంస్థలో నా వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటాను.
దేశంలో జర్నలిజాన్ని కాపాడడానికి - పాత్రికేయ విలువల్ని రక్షించడానికి మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్నినిలువరించటానికి నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది.
- రవిప్రకాష్