Begin typing your search above and press return to search.
వారిది పొలిటికల్ ఎజెండా అయితే!.. మరి రవిప్రకాశ్ దేంటో?
By: Tupaki Desk | 16 May 2019 4:40 AM GMTటీవీ9 వ్యవస్థాపకుడు - ప్రస్తుతం ఆ ఛానెల్ నుంచి అత్యంత అవమానకర రీతిలో బయటకు గెంటేయబడ్డ రవిప్రకాశ్.. ఇప్పుడు సుద్దులు చెప్పేస్తుండటం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. మొన్నటిదాకా ఏబీసీఎల్ ఆధ్వర్యంలో నడిచిన టీవీ 9ను మైహోం ఓనర్ రామేశ్వరరావు - మేఘా అధినేత కృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో కొత్తగా పుట్టుకొచ్చిన అలంద మీడియా చేతిలోకి వెళ్లిపోయింది. రామేశ్వరరావు ఆది నుంచి కేసీఆర్ కు మిత్రుడిగానే కొనసాగుతున్న విషయం జగమెరిగిన సత్యమే. మేఘా కృష్ణారెడ్డి కూడా ఇప్పుడు టీఆర్ ఎస్ కు అత్యంత సన్నిహితుడిగానే మారిపోయారు.
ఈ క్రమంలో వీరిద్దరి ఆధ్వర్యంలో ఏర్పాటైన అలంద మీడియా చేతిలోకి టీవీ 9 వెళ్లడం - ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రవిప్రకాశ్ బయటకు గెంటేయడం జరిగిపోయాయి. అంతేకాకుండా రవిప్రకాశ్ పై కేసులు పెట్టిన అలంద మీడియా ఆయనను మెడపట్టి గెంటేసినంత పనిచేసిందనే చెప్పాలి. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారోనన్న భయంతో గడచిన నాలుగు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రవిప్రకాశ్.. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఏదో సామెత చెప్పినట్లుగా సుద్దులు చెప్పేందుకే... పాటించడానికి కాదన్నట్లుగా రవిప్రకాశ్ వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
అయినా ఆ ఇంటర్వ్యూలో రవిప్రకాశ్ ఏమన్నారన్న విషయానికి వస్తే... *రామేశ్వరరావు 2016లోనే టీవీ9ను కొనాలని సంప్రదించారు. కానీ నేను ఆ ఆలోచనకు వ్యతిరేకిని. ఆయనకు రాజకీయ అజెండా వుంది. పైగా ఆయన చినజీయర్ శిష్యుడు. ముఖ్యమంత్రికి సన్నిహితుడు అందుకే ఆయన సిద్దాంతాలు - ఐడియాలజీ టీవీ9 మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు. అందుకే వ్యతిరేకించాను* అంటూ రవిప్రకాశ్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే అసలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరే.. రామేశ్వరరావుది పొలిటికల్ ఎజెండాతోనే ముందుకు సాగుతుంటే.. మరి రవిప్రకాశ్ ఇప్పటిదాకా చేసినదేమిటన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది.
ఆది నుంచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న టీవీ 9... ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏది చెబితే... అదే చేయలేదా? అన్న వాదన వినిపిస్తోంది. అంతేనా... ఇప్పుడు ఏపీలోనే కాకుండా యావత్తు తెలుగు నేలలో ఏ ఒక్కరిని అడిగినా... టీవీ 9 టీడీపీ పక్షపాతేనని చెబుతారు కదా. ఈ లెక్కన రవిప్రకాశ్ పొలిటికల్ ఎజెండాతోనే టీవీ 9 స్థాపించడం - అదే ఎజెండాతో 15 ఏళ్ల పాటు ఛానెల్ ను నిర్వహించారు కదా. అయినా చినజీయర్ శిష్యుడైతే మీడియా రంగంలోకి రావొద్దంటారా? అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. పొలిటికల్ ఎజెండాతోనే తాను సాగినా తననెవరూ ప్రశ్నించవద్దని - అదే ఇతరులు మాత్రం వారిది ఏ ఎజెండా అయినా కూడా వారిని మీడియా రంగంలోకి అడుగుపెట్టకుండా అడ్డుపుల్లలు వేయడం రవిప్రకాశ్ కే చెల్లిందన్న వాదన కూడా వినిపిస్తోంది.