Begin typing your search above and press return to search.
రవి ప్రకాష్ టీవీ9 నుంచి రూ.18.31 కోట్లు కాజేశారా..?
By: Tupaki Desk | 5 Oct 2019 2:29 PM GMTటీవీ9 వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈవో రవి ప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బోర్డు అనుమతి లేకుండా రూ.18.31 కోట్లను సొంత ఖాతాలకు మళ్లించారని టీవీ9 కొత్త యజమాన్యం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. దీంతో 41 సీఆర్‌పీసీ ప్రకారం రవిప్రకాష్‌కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేయగా, వాటిని తీసుకునేందుకు రవిప్రకాష్ నిరాకరించారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రవి ప్రకాష్ మొత్తం రూ.30 కోట్ల నిధుల కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్దంగా 9 నెలల్లో రూ.30 కోట్లు డ్రా చేశారని, బోసన్ పేరుతో రూ.18.31 కోట్లు, టీడీఎస్ రూ.11.74 కోట్లు డ్రా చేసి నకిలీ రికార్డులు క్రియేట్ చేశారని యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన 409, 418, 420 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే రవిప్రకాశ్ బోనస్ గా వచ్చిన 18.31 కోట్లలో...రూ.6.36 కోట్లు విత్ డ్రా చేశారు.
అలాగే డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎంకేవీఎన్ మూర్తిపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదైంది. ఆయన రూ.5.97 కోట్లు విత్‌డ్రా చేయగా, మరో డైరెక్టర్ క్లిఫోర్డ్ పెరారీ రూ.5.97 కోట్లు విత్‌డ్రా చేసినట్లు సమాచారం. వీరు ముగ్గురు కలిసి సంస్థ యాజమాన్యంతో సంబంధం లేకుండా తమకు తాము 18.31 కోట్ల బోనస్‌లు ప్రకటించుకున్నారని తెలుస్తోంది.
దీనిపై టీవీ9 సంస్థని టేకోవర్ చేసిన అలందా మీడియా డైరెక్టర్లు ఈ ఏడాది సెప్టెంబర్ 24న సమావేశమై పక్కదారి పట్టిన నిధులపై బోర్డులో చర్చించారు. అనంతరం పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీని మేరకు ప్రస్తుతం పోలీసులు రవి ప్రకాష్ ని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.