Begin typing your search above and press return to search.
రవిప్రకాశ్ కు ఇన్ని ఛానెల్సా?
By: Tupaki Desk | 14 May 2019 3:30 AM GMTటీవీ9 రవిప్రకాశ్ గానే జనానికి గుర్తుండిపోయిన రవిప్రకాశ్... ఇప్పుడు టీవీ 9 రవి ప్రకాశ్ ఎంతమాత్రం కాదనే చెప్పాలి. ఎందుకంటే... టీవీ 9 కొత్త యాజమాన్యంగా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన అలంద మీడియా రవిప్రకాశ్ ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బయటకు పంపింది. సీఈఓ పదవి నుంచి తొలగించడమే కాకుండా డైరెక్టర్ల బోర్డు నుంచి కూడా ఆయనను తప్పించింది. ఇకపై ఆయన టీవీ 9 కార్యాలయంలో అడుగుపెట్టాలంటే... కేవలం ఓ షేర్ హోల్డర్ గా మాత్రమే అక్కడికి వెళ్లగలరు. అయినా ఇప్పుడు రవిప్రకాశ్ ను టీవీ 9 నుంచి ఎందుకు తొలగించారన్న అసలు విషయాన్ని పక్కనపెడితే... అలంద మీడియా చెబుతున్న కారణాల్లో ఒకానొక కారణం... రవిప్రకాశ్ ఇటీవలే సొంతంగా ప్రారంభించిన మోజో టీవీకి అవసరమైన కార్యక్రమాలకు టీవీ 9 యంత్రాంగాన్నే వాడుకోవడవం. ఈ కారణాన్ని నేరుగా చెప్పకున్నా... అలంద మీడియా చేసిన ఆరోపణలను కాస్తంత తరచి చూస్తే అర్థమవుతుంది.
సరే... మరి టీవీ 9 నుంచి బయటకు వచ్చేసిన రవిప్రకాశ్ చేతులు ముడుచుకుని కూర్చోలేరు కదా. తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకైనా ఆయన ఏదో ఒక టీవీ ఛానెల్ లో చేరాల్సిందే కదా. ఏదో ఒక ఛానెల్ లో ఉద్యోగంలో చేరేంత స్థాయిని కూడా రవిప్రకాశ్ దాటిపోయారు కదా. ఈ నేపథ్యంలో తన సొంత ఛానెల్ గా ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన మోజో టీవీని మరింతగా విస్తరించాలని ఆయన నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. మరి మోజో టీవీకి ఆ మేర యంత్రాంగం లేనే లేదు. టీవీ 9లో ఉన్నంత కాలం ఆ టీవీకి చెందిన సాధన సంపత్తితోనే మోజోను నడిపించారని ఆరోపణలున్నాయి. మరి ఇప్పుడు మోజోను విస్తరించాలా? లేక వేరే పాత ఛానెల్ (ఐ న్యూస్ ) ఏదైనా టేకోవర్ చేయాలా అన్న సమాలోచన నడిచినట్టు వాదన వినిపిస్తోంది.
అదే సమయంలో రిలయన్స్ చేతిలోని న్యూస్ 18 బ్లాండ్లో రాబోయే తెలుగు న్యూస్ ఛానెల్ పై కూడా ఆయన కన్నేశారు. ఏదో ఒకటి వెంటనే మొదలుపెట్టేయాలన్నట్లు రవి ప్రకాష్ పోలీసుల నోటీసులను కూడా లైట్ తీసుకున్న రవిప్రకాశ్.. రిలయన్స్ ప్రతినిధుల భేటీ కోసం ముంబైలో ల్యాండయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇవేవీ అధికారిక ప్రకటనలు కాదు. ఓ వైపు ఐ న్యూస్, ఇంకోవైపు న్యూస్ 18... ఇప్పటికే రన్ అవుతున్న మోజో టీవీ... ఇలా ఎన్ని టీవీ ఛానెల్స్ ను రవిప్రకాశ్ నడిపిస్తారోనన్న వాదన ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. మోజో కోసం దారి తప్పడం వల్లే రవిప్రకాశ్ టీవీ 9ను పోగొట్టుకున్నాడని అందరూ అంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఐ న్యూస్ గానీ, తాను అనుకున్నట్లుగా రిలయన్స్ కూడా ఆదరిస్తే ... అప్పుడు రవిప్రకాశ్ చేతిలో మూడు ఛానెళ్లు ఉంటాయా? లేకపోతే రిలయన్స్ ది వర్కవుట్ అయితే మిగతావన్నీ వదిలేస్తారా? లేకపోతే తనను అవమానించిన టీవీ 9 యాజమాన్యానికి చుక్కలు చూపేందుకు ఈ మూడు ఛానెళ్లను నడిపిస్తారా? ఇలాంటి అనేక ప్రశ్నలు జనాల మదిలో మెదులుతున్నాయి.