Begin typing your search above and press return to search.

ఏ క్ష‌ణంలో అయినా ర‌విప్ర‌కాశ్ అరెస్ట్!

By:  Tupaki Desk   |   25 May 2019 5:31 AM GMT
ఏ క్ష‌ణంలో అయినా ర‌విప్ర‌కాశ్ అరెస్ట్!
X
టీవీ9కు సంబంధించి మోసం.. న‌మ్మ‌క‌ద్రోహం.. లోగో అమ్మ‌కం ప‌లు అంశాల‌పై ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ ను అరెస్ట్ చేసేందుకు సైబ‌రాబాద్ పోలీసులు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టివ‌ర‌కూ నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఆయ‌న‌కు ఆయ‌న‌గా విచార‌ణ‌కుహాజ‌ర‌వుతార‌ని ఆశించారు. అనంత‌రం ఆయ‌న కోసం వెతుకులాట మొద‌లెట్టారు.

తామిచ్చిన నోటీసుల‌కు స్పందించ‌కుండా ఉండ‌టంతో పాటు.. అండ‌ర్ గ్రౌండ్ కు వెళ్లిన ఆయ‌న్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. టీవీ9 కొత్త యాజ‌మాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు న‌మోదు చేసిన పోలీసులు ఆయ‌న ఆచూకీని తెలుసుకునేందుకు ప్ర‌త్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు.

త‌న‌పై ఫిర్యాదులు న‌మోదైన నేప‌థ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయ‌న పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. ఆరోగ్యం బాగోలేద‌ని.. మరింత గ‌డువు కావాల‌న్న విన‌తుల‌తో పాటు.. ముంద‌స్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్ర‌యించారు. అయితే.. ఎక్క‌డా ఆయ‌న‌కు సానుకూల‌త వ్య‌క్తం కావ‌ట్లేదు. ఇదిలా ఉండ‌గా.. ఆయ‌న‌కు జారీ చేసిన 41-ఏ సీర్పీసీ ప్ర‌కారం పోలీసుల ఎదుట హాజ‌రు కావాల్సి ఉంది. దీని గ‌డువు కూడా ముగియ‌టంతో ఆయ‌న అరెస్ట్ ఏ క్షణంలో అయినా చోటు చేసుకోవ‌చ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే ర‌విప్ర‌కాశ్ కోసం గాలిస్తున్న పోలీసుల‌కు.. ఆయ‌న ఎక్క‌డ ఉంద‌న్న విష‌యం మీద ప‌క్కా స‌మాచారం ఉంద‌ని.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఏ క్ష‌ణంలో అయినా అరెస్ట్ కావ‌టం త‌థ్య‌మ‌న్న మాట పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. తాను చేసేది ధ‌ర్మ‌పోరాటం.. న్యాయ‌పోరాట‌మైన‌ప్పుడు అరెస్ట్ చేస్తే చేశారు.. నేరుగా వ‌చ్చి పోలీసు విచార‌ణ‌కు హాజ‌రైతే స‌రిపోతుంది క‌దా? చూస్తుంటే.. పోలీసులు అరెస్ట్ చేసే వ‌ర‌కూ ఇష్యూను ర‌విప్ర‌కాశ్ తీసుకెళ‌తార‌న్న అభిప్రాయం క‌లుగ‌క మాన‌దు.