Begin typing your search above and press return to search.
టీవీ9 మేనేజ్ మెంట్ మారట్లేదట!
By: Tupaki Desk | 24 Aug 2018 1:10 PM GMTప్రముఖ తెలుగు న్యూస్ చానల్ టీవీ-9 అమ్మకానికి సిద్ధమైందని గతంలో బిజినెస్ మీడియా, కొన్ని పత్రికలలో వార్తలు....సోషల్ మీడియాలో పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. టీవీ-9 పేరిట తెలుగు, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో వార్తా చానల్స్ ను నిర్వహిస్తోన్న అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) సంస్థ మెజారిటీ వాటాలను విక్రయించేందుకు చర్చలు సాగుతున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే, అవన్నీ సద్దుమణగి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇపుడు తాజాగా, మరోసారి టీవీ 9 మేనేజ్ మెంట్ మారబోతోందని, అందులో వాటాలు వేరేవారు కొనేశారని ...సోషల్ మీడియాలో - కొన్ని మీడియా చానెళ్లలో పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలను - పుకార్లను టీవీ 9 ప్రతినిధులు ఖండిండినట్లు వార్తలు వస్తున్నాయి.
తమ చానెల్ మేనేజ్ మెంట్ మారబోతోందంటూ వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని టీవీ9 ప్రతినిధి చెప్పినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనిని బట్టి శ్రీనిరాజుతోపాటు పాత యాజమాన్యం కొనసాగుతోంది. సీఈవోగా రవి ప్రకాష్ ఉంటారు. అందులో ఎటువంటి మార్పులు లేవు. అయితే, చానెల్ ను విస్తరించే క్రమంలో కొంతమంది ఇన్వెస్టర్లు జాయిన్ అవుతున్న క్రమంలో ఈ పుకార్లు వచ్చి ఉండవచ్చని టాక్. మరోవైపు, చింతలపాటి శ్రీనిరాజు ఆధ్వర్యంలో నడుస్తున్న పీపుల్ క్యాపిటల్ ఎల్ ఎల్సీతో పాటు, యూఎస్ కు చెందిన పీఈ (ప్రైవేటు ఈక్విటీ) సంస్థ సైఫ్ పార్ట్ నర్స్ వద్ద ఏబీసీఎల్ లోని 80 శాతం వాటా టీవీ 9 సీఈఓ రవిప్రకాష్ తదితరుల వద్ద ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో కూడా టీవీ-9 బ్రాండ్ విలువ రూ. 850 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల మధ్య ఉండవచ్చని, ఆ ప్రముఖ చానల్ ను కొనేందుకు నాలుగు మీడియా సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయని వదంతులు వచ్చాయి.