Begin typing your search above and press return to search.
ఆధార్ తో లింకు వద్దన్న కేంద్రమంత్రి
By: Tupaki Desk | 2 April 2018 6:59 AM GMTఆధార్ తో లింకు చేసుకోవటంపై సోషల్ మీడియాలో కనిపించే జోకులు అన్నిఇన్ని కావు. ప్రధాని మోడీ ఏం చేసినా చేయకున్నా.. ఆధార్ తో అన్నింటిని లింక్ చేయించే పనిని మాత్రం భేషుగ్గా చేస్తున్న సటైర్లు జోరుగా వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. ఓటర్లు తమ ఓటరు కార్డును ఆధార్ తో అనుసంధానించుకునే అంశంపై కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకోకుండా ఉండాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయంగా ఆయన చెప్పారు. అయితే.. తాను చెప్పేది కేంద్రమంత్రి హోదాలో కాకుండా.. వ్యక్తిగత హోదాలో ఈ మాటను చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఓటరు కార్డును ఆధార్ తో లింకేజ్ వద్దని చెప్పటం వెనుక అసలు విషయాన్ని ఆయన చెబుతూ.. తమ ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడుతుందన్న అపవాదు వస్తున్న వేళలో.. ఆధార్ తో లింకు లేకున్నా ఫర్లేదన్నారు. ఆధార్ నంబరును బ్యాంక్ ఖాతాతో లింక్ చేస్తే.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితం నేరుగా బ్యాంకు ఖాతాలోకి వచ్చి చేరుతుందన్నారు.
ప్రజల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చులో ప్రతి రూపాయికి కేవలం 15 పైసలు మాత్రమే వెళుతున్నట్లు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ పేర్కొన్నారని.. కానీ తమ ప్రభుత్వ హయాంలో మాత్రం వెయ్యి రూపాయిల్ని నేరుగా.. ఎవరి ప్రమేయం లేకుండా బ్యాంకు ఖాతాలోనే వేస్తున్నట్లు గొప్పలు చెప్పారు. ఈ గొప్పలకు తక్కువ లేదు కానీ.. అమిత్ షా కొడుకు అవినీతి మీద వచ్చిన ఆరోపణల మీద కూడా మాట్లాడితే మరింత బాగుంటుంది కదా?