Begin typing your search above and press return to search.
కేజ్రివాల్ పాక్ లో హీరో అయిపోయాడోచ్!
By: Tupaki Desk | 4 Oct 2016 4:25 PM GMTఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పాక్ ప్రజలు పిచ్చిపిచ్చిగా ఇష్టపడుతున్నారట. భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాకిస్థాన్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడానికి సర్జికల్ దాడుల వీడియోలను బయటపెట్టాలని కేజ్రీవాల్ ఓ వీడియో సందేశంలో కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో విదేశీ మీడియా కూడా పాకిస్థాన్ కు మద్దతు పలుకుతోందని, అందుకే దాడికి తగిన ఆధారాలు బయటపెట్టాలని కేజ్రీవాల్ కోరారు. కేజ్రీ చేసిన ఈ ప్రకటన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ విరుచుకుపడ్డారు. మెరుపు దాడిపై విమర్శలతో పాక్ లో కేజ్రివాల్ మెరిసిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.
''కేజ్రీవాల్...మీరు చేసిన ప్రకటనతో పాకిస్థాన్ మీడియాలో హెడ్ లైన్ గా మారిపోయారు. అయితే ఒక్క విషయం గమనించుకోండి. రాజకీయాలు వేరు, దేశం గౌరవం వేరు. మన ఆర్మీ ఆత్మస్థైర్యం దెబ్బతినే ఇలాంటి వ్యాఖ్యాలు చేయకండి'' అని రవిశంకర్ ప్రసాద్ సూచించారు. భారత ఆర్మీకి సర్జికల్ దాడులు చేయగల సత్తా ఉందా లేదా అనేది కేజ్రీవాల్ చెబితే బాగుంటుందని అన్నారు. ఒకవేళ ఉంది అని అంగీకరిస్తే పాకిస్థాన్ చేసే అసత్య ప్రచారంతో ఎందుకు ప్రభావితమవుతున్నారని కేజ్రీవాల్ ను రవిశంకర్ ప్రసాద్ సూటిగా ప్రశ్నించారు. సర్జికల్ దాడులపై కేజ్రీవాల్ తోపాటు కాంగ్రెస్ కూడా ప్రశ్నలు లేవనెత్తడాన్ని ఆయన తప్పుబట్టారు.ఈ సందర్భంగా ఆర్మీ సామర్థ్యాన్ని శంకించే బృందంలో మీరు కూడా చేరారా అని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిదంబరాన్ని కూడా రవిశంకర్ నిలదీశారు. దేశం కోసం రాజకీయాలు పక్కన పెట్టడం భారత ప్రయోజనాలకు మేలు చేసే అంశం అవుతుందని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/