Begin typing your search above and press return to search.

సీఏఏపై రాష్ట్రాలకు షాకిచ్చిన కేంద్రం

By:  Tupaki Desk   |   1 Jan 2020 7:20 AM GMT
సీఏఏపై రాష్ట్రాలకు షాకిచ్చిన కేంద్రం
X
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే రోడ్డెక్కి నిరసన కారులతో ర్యాలీ తీశారు.బెంగాల్ లో అమలు చేయమని కేంద్రానికి షాకిచ్చారు. మరికొన్ని రాష్ట్రాల సీఎంలు కూడా పౌరసత్వ సవరణ చట్టం అమలు కానీయమని తేల్చిచెబుతున్నారు. కేరళ అసెంబ్లీలో సీఏఏను అమలు చేసేది లేదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ఆమోదించారు.

అయితే తాజాగా దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగబద్దమైనదని అన్నారు. ఎన్నార్సీ - ఎన్పీఆర్ పై ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు కల్పిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

పౌరసత్వానికి సంబంధించి చట్టం చేసే అధికారం కానీ.. తీర్మానం ఆమోదించే అధికారం కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. అసెంబ్లీలకు ఎంతమాత్రం అధికారం లేదన్నారు. అమలు చేయమన్న కేరళ సీఎం న్యాయ సలహా తీసుకుంటే అర్థమవుతుందన్నారు.