Begin typing your search above and press return to search.
కొహ్లీ తో ఫ్రెండ్షిప్.. పది కోట్ల వేతనం!
By: Tupaki Desk | 10 Sep 2019 1:30 AM GMTటీమిండియా కోచ్ గా రవిశాస్త్రి ఎంపిక కావడానికి ప్రధాన కారణం ఏమిటి? అంటే.. క్రికెట్ విశ్లేషకులు ఆ విషయంలో ఒకే మాట చెబుతారు. కెప్టెన్ విరాట్ కొహ్లీతో రవిశాస్త్రికి చాలా సాన్నిహిత్యం ఉందని, దాని వల్లనే ఆయన మరోసారి టీమిండియాకు హెడ్ కోచ్ గా ఎంపికయ్యారని చాలా మంది తేల్చేస్తారు. వాస్తవానికి కోచ్ గా రవిశాస్త్రి చేస్తున్న అద్భుతాలు ఏమీ లేవు. నిర్ణయాధికారాలను చాలా వరకూ కెప్టెన్ కే వదిలి పెట్టేసి, అసిస్టెంట్ కోచ్ లకు బాధ్యతలు అప్పగించేయడమే రవిశాస్త్రి పని అంటారు పరిశీలకులు.
టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ వేరే, బౌలింగ్ కోచ్ వేరే, ఫీల్డింగ్ కోచ్ వేరే.. ఇతర వ్యవహారాల మేనేజర్ మరొకరు. వారందరితో పాటు రవిశాస్త్రి ఉంటారు. ప్రధాన కోచ్ మాత్రం ఈయనే. గతంలో కోచ్ గా ఉన్నప్పుడే రవిశాస్త్రి రికార్డు స్థాయి పారితోషకం పొందాడు. ప్రపంచంలోని అన్ని క్రికెట్ జట్ల కోచ్ ల కన్నా టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి ఎక్కువ డబ్బులను ఆర్జించారు. అప్పట్లో రవిశాస్త్రి ఎనిమిది కోట్ల రూపాయల మేరకు పారితోషకం పొందాడని బీసీసీఐ ప్రకటించింది.
ఇటీవల మళ్లీ ఇంటర్వ్యూలు - మళ్లీ రవిశాస్త్రి నియామకమే జరిగింది కదా.. అందుకు గానూ.. మరో ఇరవై శాతం అదనంగా వేతనం పొందుతున్నారట. దీంతో ఆయన వేతనం దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలా అరవై లక్షల వరకూ చేరిందట. ఇవిగాక ఇతర అలవెన్స్ ఉండనే ఉంటాయి. స్థూలంగా రవిశాస్త్రి వార్షిక వేతనం పది కోట్ల రూపాయలకు పైనే అని తెలుస్తోంది. ఇక జట్టు ఏదైనా మెయిన్ ట్రోఫీల్లో విజయం సాధిస్తే.. ప్రోత్సాహకాలు కూడా ఉండనే ఉంటాయి. ఏతావాతా కొహ్లీతో సన్నిహిత సంబంధాలు ఈ మాజీ ఆటగాడికి ఈ స్థాయి పారితోషకాలను రుచి చూపిస్తున్నట్టున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.