Begin typing your search above and press return to search.
మళ్లీ కోచ్ గానే కొనసాగనున్న రవిశాస్త్రి .
By: Tupaki Desk | 8 Nov 2021 8:36 AM GMTసౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న సీఏసీ, ఏరికోరి రవిశాస్త్రిని టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపిక చేసింది. రవిశాస్త్రికి ఏటా రూ.8 కోట్లు చెల్లిస్తోంది బీసీసీఐ. 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందే 2019, జూన్ 13 నాటికి రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయితే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువును పొడగించింది బీసీసీఐ. 2019, ఆగస్టు 16న భారత సారథి విరాట్ కోహ్లీ సపోర్ట్ తో భారత హెడ్ కోచ్ గా తిరిగి నియమితుడయ్యాడు రవిశాస్త్రి. ఆ కాంట్రాక్ట్ గడువు 2021 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీతో ముగియనుంది.
ప్రధాన కోచ్ రవిశాస్త్రి అండ్ కో పదవీ కాలం నేటి భారత్-నమీబియా మ్యాచ్‌తో ముగిసిపోనుంది. ఆ తర్వాత రవి ఏం చేయబోతున్నారనే ఊహాగానాలకు సమాధానం దొరికేసింది. ఇప్పటి వరకు కోహ్లీసేనను నడిపించిన రవిశాస్త్రి ఇకపై ఐపీఎల్ జట్టును నడిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల పురుడుపోసుకున్న కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ యాజమాన్యం రవిశాస్త్రిని సంప్రదించినట్టు తెలుస్తోంది. రవిశాస్త్రిని మాత్రమే కాకుండా అతడి సహచరులైన బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్‌లను కూడా తీసుకోవాలని అహ్మదాబాద్ యాజమాన్యం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే ఈ డీల్‌పై రవి సంతకం చేస్తాడని కూడా చెబుతున్నారు. కాగా, క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రవిశాస్త్రి దశాబ్దానికిపైగా కామెంటేటర్‌గా పనిచేశాడు. సక్సెస్‌ఫుల్ కామెంటేటర్‌గా పేరుగాంచాడు. ఆ తర్వాత టీమిండియాకు రెండుసార్లు మొత్తంగా 15 ఏళ్లు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు మరోమారు ఐపీఎల్ జట్టుకు కోచ్‌గా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.