Begin typing your search above and press return to search.

కోహ్లీతో గొడవలు..క్లారిటీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్

By:  Tupaki Desk   |   30 Sep 2021 5:30 PM GMT
కోహ్లీతో గొడవలు..క్లారిటీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్
X
టీం ఇండియా కెప్టెన్ .. అతి త్వరలో టీ20 ల కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పనున్నారు. అయితే , ఈ వార్త బయటకి వచ్చినప్పటి నుండి ఓ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. అదేమిటి అంటే రహానే, పుజారా తో కలిసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని, కోహ్లి టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడానికి పరోక్ష కారకుడని వార్తలు ప్రచారం అవుతోన్న నేపథ్యంలో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవి చంద్రన్ అశ్విన్‌ తొలిసారి స్పందించాడు. కోహ్లి ఎపిసోడ్‌లో తన ప్రమేయం ఏమాత్రం లేదని వివరణ ఇచ్చాడు. ఈ విషయమై బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ ఇదివరకే స్పష్టతనిచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు.

అసత్య కథనాలు ప్రసారం చేసి టీమిండియా అభిమానులను తప్పుదోవ పట్టించరాదని ఓ ప్రముఖ వార్తా సంస్థపై విరుచుకుపడ్డాడు. ఫేక్ న్యూస్ అనే హ్యాండిల్ కోసం వెతుకుతున్నానని, అది పేరు మార్చుకుని ఓ ప్రముఖ న్యూస్‌ ఏజన్సీగా మారిందని, అలాంటి వార్తా సంస్థల్లో ప్రసారమయ్యే నిరాధారమైన కథనాలను బేస్‌ చేసుకుని మరిన్ని వార్త సంస్థలు కట్టుకథలు అల్లుతున్నాయని తన ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. కాగా, ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌ లో కోహ్లి అసమర్ధత వల్లే టీమిండియా ఓడిపోయిందని, ఈ విషయాన్ని అశ్విన్‌ సహా రహానే, పుజారాలు బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఫోన్‌ చేసి మరీ ఫిర్యాదు చేశారని ఓ టాప్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఈ కథనంపై అశ్విన్ తనదైన స్టైల్‌ల్లో విరుచుకుపడ్డాడు. అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశాడు. సదరు న్యూస్ ఏజెన్సీని ట్రోల్ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ముగ్గురు సీనియర్ ప్లేయర్లు.. అతనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌కు కంప్లయింట్ ఇచ్చారంటూ ఒకట్రెండు రోజులుగా మీడియాలో వరుసగా కథనాలు వెలువడుతోన్నాయి. దీనికంతటికీ మూలకారకుడు రవి చంద్రన్ అశ్వినే అనేది మీడియాలో వస్తోన్న కథనాల సారాంశం. విశ్వసించదగ్గ న్యూస్ ఏజెన్సీ కావడం వల్ల దాన్ని అన్ని స్పోర్ట్స్ న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేశాయి. ఈ మీడియాలో వెలువడిన ఈ కథనాల పట్ల రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపడేశాడు. మరో క్రికెటర్ లేదా సెలెబ్రిటీ అయి ఉంటే ఓ రిజాయిండర్ ఇచ్చేవాళ్లు. అక్కడున్నది రవిచంద్రన్ అశ్విన్. అందుకే- తనదైన స్టైల్‌ లో కౌంటర్ అటాక్‌ కు దిగాడు. ఆ న్యూస్ ఏజెన్సీని ట్రోల్ చేశాడు. ఈ మేరకు తన అధికారిక ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. మొత్తానికి తమ మధ్య గొడవలు లేవంటూ రవిచంద్రన్ అశ్విన్ క్లారీటీ ఇచ్చాడు. బీసీసీఐ కూడా విరాట్ కోహ్లీ పై ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ తెలిపింది. కెప్టెన్సీ నుంచి దిగమని మేం ఒత్తిడి చేయలేదంటూ తెలిపింది. అయినా, టీమిండియాలో ఏదో నడుస్తోందన్న టాక్ విన్పిస్తోంది