Begin typing your search above and press return to search.
ఆ దేశంలో బిలియనీర్ల వరుస మరణాలు.. ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 2 Sep 2022 10:30 AM GMTఉక్రెయిన్‌పై యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లలో నానిన రష్యాలో ఇప్పుడు మిస్టరీ మరణాలు ఆ దేశ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, బిలియనీర్లు ఇలా ఇప్పటివరకు వరుసగా ఎనిమిది మంది కన్నుమూయడం గమనార్హం. వీరంతా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
తాజాగా రష్యాకు చెందిన లుకోయిల్ ఆయిల్ దిగ్గజం ఛైర్మన్ రవిల్ మగనోవ్ రష్యా రాజధాని మాస్కోలోని ఆసుపత్రి కిటికీ నుండి పడి మరణించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.
లుకోయిల్ కంపెనీ కూడా ఆయన మరణాన్ని ధృవీకరించింది , అయితే మగనోవ్ (67) "తీవ్ర అనారోగ్యంతో మరణించాడు" అని మాత్రమే చెప్పింది. ఆయన మాస్కోలోని సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని.. గాయాలతో మరణించాడని రష్యా మీడియా తెలిపింది. కాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడిన ఖండించినవారిలో మగనోవ్ కూడా ఒకరు.
కాగా లుకోయిల్ (Lukoil) ఆయిల్ కంపెనీ ప్రపంచలోనే అతిపెద్ద ఇంధన సంస్థల్లో ఒకటిగా ఉంది. రష్యా యొక్క అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ. 1993 ఒక ప్రైవేటు ఆయిల్ కంపెనీలో చిరుద్యోగిగా చేరిన మగనోవ్.. రెండేళ్ల క్రితం లుకోయిల్ ఆయిల్ కంపెనీకి చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన సంస్థలలో ఒకటిగా పరిణామం చెందడానికి మగనోవ్ నిర్వాహక ప్రతిభే కారణం. ఇందుకు గానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని కూడా అందించారు.
కాగా మగనోవ్ చికిత్స పొందిన ఆస్పత్రి.. మాస్కో పశ్చిమ శివార్లలో ఉంది. దీనికి రష్యన్ రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు అనారోగ్యం పాలైతే మంచి చికిత్స అందించే ఆస్పత్రిగా పేరుంది. మగనోవ్ ఎలా చనిపోయాడో నిర్ధారించేందుకు సంఘటనా స్థలంలో విచారణ చేస్తున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆయన సెప్టెంబర్ 1న తెల్లవారుజామున ఆస్పత్రి ఆరో అంతస్తు కిటికీలోంచి పడిపోయాడని, తరువాత ప్రాణాలు కోల్పోయాడని మీడియాలో కథనాలు వచ్చాయి.
కాగా ఇటీవలి నెలల్లో అనేక రష్యన్ బిలియనీర్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. గాజ్‌ప్రోమ్ ఇన్వెస్ట్‌లో ట్రాన్స్‌పోర్ట్ హెడ్ లియోనిడ్ షుల్మాన్ జనవరి 2022లో లెనిన్స్కీలో చనిపోయాడు. మరో టాప్ గాజ్‌ప్రోమ్ ఎగ్జిక్యూటివ్, అలెగ్జాండర్ త్యులాకోవ్ ఒక నెల తర్వాత ఫిబ్రవరి అదే గ్రామంలో చనిపోయినట్లు గుర్తించారు. ఉక్రేనియాలో జన్మించిన రష్యన్ బిలియనీర్ మిఖాయిల్ వాట్‌ఫోర్డ్ ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌లోని తన ఇంటిలో మృతి చెందాడు. మెడ్‌స్టామ్ యజమాని.. వాసిలీ మెల్నికోవ్ మార్చి చివరిలో నిజ్నీ నొవ్‌గోరోడ్‌లో ఆయన కుటుంబంతో సహా మరణించాడు.
రష్యన్ మిలియనీర్ నోవాటెక్ మాజీ మేనేజర్ సెర్గీ ప్రోటోసెన్యా మృతదేహం ఏప్రిల్‌లో స్పానిష్ విల్లాలో ఆయన భార్య, కుమార్తెతో లభించింది. గాజ్‌ప్రోమ్‌బ్యాంక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వ్లాడిస్లావ్ అవయేవ్ తన భార్య , కుమార్తెతో కలిసి మాస్కోలోని వారి ఫ్లాట్‌లో ఏప్రిల్‌లో చనిపోయాడు. లుకోయిల్ మాజీ మేనేజర్ అలెగ్జాండర్ సబ్బోటిన్ ఈ ఏడాది మేలో మాస్కో సమీపంలోని ఒక ఇంటిలో మరణించారు.
కాగా ఒకప్పటి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (యూఎస్ఎస్ఆర్) మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ ఆగస్టు 31 అదే ఆసుపత్రిలోని సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్‌లో మరణించడం గమనార్హం. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆస్పత్రికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.