Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు గుడి కట్టేశారు
By: Tupaki Desk | 18 Feb 2016 3:58 AM GMTఅప్పట్లో ఖుష్బూకు, ఆ తర్వాత నమితకు వాళ్ల ఫ్యాన్స్ గుడి కట్టించేసి సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తాను స్వయంగా గుడి కట్టిస్తానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శంకర్రావు కూడా కలకలం సృష్టించారు. అయితే అది ఆచరణ రూపం దాల్చలేదు అనుకోండి. అయితే తమిళంలో ఈ గుడుల కల్చర్ ఎక్కువగా ఉంటుంది. నచ్చిన రాజకీయ నాయకుడు, నాయకురాలికి, అమితంగా ఇష్టపడే హీరోయిన్, హీరోలకు గుడి కట్టేయడం తమిళలకు అలవాటే. అయితే తెలంగాణలో ఇలాంటి కల్చర్ కు బీజం పడింది. మారుమూల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో ఓ అభిమాని టీఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుడి నిర్మించాడు. చక్కటి పాలరాతితో కేసీఆర్ విగ్రహాన్ని తయారుచేయించి ఏకంగా తన ఇంటి ఆవరణలో మందిరంలో ప్రతిష్టించాడు.
ఈ విధంగా అభిమానం చాటుకున్న వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్. తెలంగాణ పోరాటం జోరుగా సాగుతున్న సమయంలో స్వంత ఖర్చులతో తెలంగాణ తల్లి - ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను నిర్మించాడు. తాజాగా కేసీఆర్ కు గుడికట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సతీమణితో కలిసి రవీందర్ ఈ గుడిని ఆవిష్కరించారు. కొసమెరుపు ఏంటంటే ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ - ఎమ్మెల్యేలను ఆహ్వానించినప్పటికి...బ్రతికి ఉన్న సమయంలో గుడిని ఆవిష్కరిస్తే లేనిపోని వివాదం ముసురుతుందనే భావనతో వారు రాకుండా దూరంగా ఉండిపోయారు. దీంతో రవీందర్ దంపతులు స్వయంగా గుడిని ఆవిష్కరించుకున్నారు.