Begin typing your search above and press return to search.
భక్తుడికి కోపం వచ్చింది.. కేసీఆర్ గుడికి తాళం పడింది
By: Tupaki Desk | 31 Jan 2021 12:50 PM GMTఅభిమాన తారలు.. రాజకీయ నేతల మీద గుండెల్లో ఉప్పొంగే అభిమానం ఉన్నప్పటికీ.. చాలామంది చేయని పనిని కొందరు వీరాభిమానులు చేస్తుంటారు. తాము ఆరాధించే వారి పేరిట గుడులు కట్టే ధోరణి తమిళనాడులో కనిపిస్తూ ఉంటుంది. తమిళ తంబీల అంత కాకున్నా.. కొంతమేర ఇలాంటి ధోరణి తెలంగాణలోనూ కనిపిస్తూ ఉంటుంది. సారు మీద అభిమానంతో ఆరేళ్ల క్రితం కేసీఆర్ కు గుడి కట్టించేశారు దండేపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గుండా రవీందర్.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన సారును విపరీతంగా ఆరాధిస్తుంటారు. అయినప్పటికీ ఆయనకు పెద్ద గుర్తింపు లభించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కేసీఆర్ గుడి ముందున్న విగ్రహానికి ఇచ్చారు. ఈ వ్యవహారం మీడియాలో వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయినప్పటికి ఎలాంటి బుజ్జగింపులకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించలేదు.
దీంతో.. తనలాంటి వీరాభిమానికి గుర్తింపు లేకపోవటాన్ని జీర్ణించుకోలేని ఆయన.. తాజాగా మరో ఆగ్రహ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాను అభిమానించే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారుల కంటే ఉద్యమంతో సంబంధం లేని వారే గుర్తింపు లభించటాన్ని ఆయన తప్పుపడుతున్నారు. అందుకే.. తాను కేసీఆర్ గుడిని మూసివేయాలని నిర్ణయించారు.
కేసీఆర్ మీద అభిమానంతో తాను గుడిని నిర్మించానని.. పూజలు చేశానని.. అయినప్పటికి తనకు గుర్తింపు లభించలేదన్నారు. తన బాధలు చెప్పుకునేందుకు కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తే.. పట్టించుకోవటం లేదంటున్నారు. అందుకే.. విగ్రహానికి ముసుగు వేసి.. గుడికి తాళం వేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. తాజా నిర్ణయం.. టీఆర్ఎస్ నేతల్ని కదిలేలా చేస్తుందో చూడాలి.