Begin typing your search above and press return to search.
మోడీ పేరెత్తినందుకే...చెప్పుతో కొట్టిన ఎంపీ!
By: Tupaki Desk | 6 April 2017 9:59 AM GMTఎయిరిండియా ఉద్యోగిపై చెప్పుతో దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తన ప్రవర్తన పట్ల షాకింగ్ వివరణ ఇచ్చారు. ఇవాళ లోక్ సభకు వివరణ ఇచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని రవీంద్ర గైక్వాడ్ అన్నారు. తాను ఏమైనా తప్పు చేసి ఉంటే సభకు క్షమాపణ చెబుతున్నానని, ఆ ఉద్యోగికి మాత్రం చెప్పనని ఆయన స్పష్టంచేశారు. సదరు ఉద్యోగి తనతో తప్పుగా మాట్లాడాడని గైక్వాడ్ చెప్పారు.
`నువ్వు ఎవరు అని ఆ ఉద్యోగిని అడిగితే.. నేను ఎయిరిండియా బాప్ ను నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు` అని గైక్వాడ్ తెలిపారు. తాను ఓ ఎంపీనని చెప్పగా...`అయితే ఏంటి? నువ్వేమైనా మోడీవా?`` అని అడిగాడని గైక్వాడ్ సభకు చెప్పారు. ఈ మాట అన్న తర్వాత అతన్ని తాను తోసేశానని, ఈమాత్రం దానికే తనపై హత్యాయత్నం కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. విమాన సిబ్బంది తన కాలర్ పట్టుకొని లాగారని ఆరోపించారు. తప్పు చేసిన ఆ ఉద్యోగి స్వేచ్ఛగా తిరుగుతుంటే.. తాను మాత్రం నిషేధాలు, కేసులు ఎదుర్కొంటున్నానని గైక్వాడ్ వాపోయారు.
ఎలాంటి విచారణ లేకుండా ఓ ఎంపీపై ఎలా నిషేధం విధిస్తారని, అసలు విచారణ కంటే మీడియా విచారణే ఎక్కువైందని గైక్వాడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ లైన్స్ తనపై విధించిన నిషేధాన్ని, తనపై అక్రమంగా పెట్టిన కేసును ఎత్తేయాలని గైక్వాడ్ కోరారు. శివసేన మరో ఎంపీ అనంత్ కుమార్ మాట్లాడుతూ.. గైక్వాడ్ పై ఎయిర్ లైన్స్ విధించిన నిషేధాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/