Begin typing your search above and press return to search.

గాయం తర్వాత తొలి మ్యాచ్ లోనే పరుగుల వరద పారించి.. రికార్డులు బ్రేక్ చేశాడు

By:  Tupaki Desk   |   6 March 2022 4:45 AM GMT
గాయం తర్వాత తొలి మ్యాచ్ లోనే పరుగుల వరద పారించి.. రికార్డులు బ్రేక్ చేశాడు
X
గాయం తర్వాత ఆటకు.. జట్టుకు దూరమైన క్రికెటర్ కు మళ్లీ ఎంట్రీ ఇచ్చిన మ్యాచ్ లో ఎంతటి ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటిది.. అంతటి ఒత్తిడిని అధిగమిస్తూ తన సత్తా చాటటమే కాదు.. రికార్డులు బద్ధలు కొట్టేలా పరుగుల వరద పారించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

శ్రీలంకతో జరుగుతున్న టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ లో ఏడో బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగిన అజయ్ జడేజా దూకుడు.. మ్యాచ్ స్వరూపాన్ని మొత్తంగా మార్చేసింది. అద్భుతమైన సెంచరీతో పాటు.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

తాజాగా మ్యాచ్ లో 175 పరుగులు సాధించిన అతడు.. పాత రికార్డుల్ని బ్రేక్ చేశాడు. ఏడో స్థానంలో బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగి ఇన్ని భారీ పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా జడేజా రికార్డును సొంతం చేసుకన్నాడు.

గతంలో కపిల్ దేవ్ రికార్డును జడేజా తాజాగా బ్రేక్ చేశారని చెప్పాలి. 1986లో శ్రీలంకపై ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కపిల్ దేశ.. 163 పరుగులు సాధిస్తే.. ఆ రికార్డును జడేజా అధిగమించారు. దీంతో తొలిస్థానంలో జడేజా నిలిస్తే.. రెండో స్థానంలో కపిల్.. మూడో స్థానంలో పంత్ (159 పరుగులు) మూడో స్థానంలో నిలిచారు.

గాయం తర్వాత మొదలు పెట్టిన మొదటి మ్యాచ్ లోనూ భారీ ఎత్తున పరుగుల వరదను పారించిన జడేజా పుణ్యమా అని స్కోర్ బోర్డు భారీగా పెరిగిపోయింది. భారత్ తొలి ఇన్సింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 572 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ మెన్లలో జడేజా 175 పరుగులతో మెరిస్తే.. 96 పరుగులతో పంత్.. 61 పరుగులతో అశ్విన్ టాప్ స్కోరర్లుగా నిలిచారు.