Begin typing your search above and press return to search.
అసెంబ్లీలో ఆ చెట్టు.. రావెల సేమ్ టు సేమ్!
By: Tupaki Desk | 31 Oct 2017 6:22 AM GMTరేవంత్ ఎపిసోడ్ నేపథ్యంలో నేతల మధ్య ఆసక్తికర సంబాషణలు జరుగుతున్నాయి. ఎవరికి వారే.. ఏంటి మా పార్టీలోకి వస్తావా? అంటూ నవ్వుతూ మాట్లాడుకోవటం కనిపిస్తోంది. నేరుగా అనకున్నా.. నర్మగర్భంగా అనుకుంటున్న మాటలు ఇప్పుడు ఇంట్రస్టింగ్ మారాయి టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విలేకరులతో మాట్లాడి వెళుతున్న క్రమంలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పలుకరించారు.
మాటల మధ్యలో వస్తావా? అంటూ నర్మగర్భంగా ప్రశ్నించారు. దీంతో పనుంది వెళ్లొస్తా? అంటూ రావుల తన దారిన తాను వెళ్లటం కనిపించింది. అంతుకు ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంగా రావుల తాను పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదని చెప్పారు.
తన రాజకీయ జీవితం మొత్తం టీడీపీలోనే సాగిందని.. ఇకపై కూడా టీడీపీలోనే ఉంటానన్నారు. పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? అన్న మీడియా ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. అసెంబ్లీ ఆవరణలో సభ్యులు ప్రవేశించే ద్వారం దగ్గరున్న చెట్టును చూపించారు. ఆ చెట్టు వయసు తనకు తెలీదని.. కానీ ఎంతోమంది సభ్యులు ఎమ్మెల్యే వచ్చి వెళ్లారని.. కానీ ఆ చెట్టు మాత్రం అక్కడే ఉందన్నారు. తాను కూడా ఆ చెట్టు లాంటి వాడినేనని.. టీడీపీలో నుంచి బయటకు వెళ్లేది లేదని చమత్కరించారు. ఇలాంటి మాటలు చెప్పిన చాలామంది తర్వాతి కాలంలో పార్టీ మారటం తెలిసిందే. మరి.. రావుల కూడా ఆ జాబితాలో చేరతారా? లేదా? అన్నది కాలమే డిసైడ్ చేస్తుందని చెప్పక తప్పదు.