Begin typing your search above and press return to search.
రాయలసీమ దాహం.. జగన్ పై ఆశలు!
By: Tupaki Desk | 13 Aug 2019 1:30 AM GMTరాయలసీమ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో తీవ్రమైన నిర్లక్ష్యానికి గురి అయ్యింది. ఆ విషయంలో సీమ ప్రజల స్పందన ఎన్నికలతో వ్యక్తం అయ్యింది కూడా. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనుకున్న అనంతపురం జిల్లాలో కూడా ఆ పార్టీ కేవలం రెండు సీట్లను మాత్రమే నెగ్గింది. మొత్తం రాయలసీమ మీద తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గింది ముగ్గురే ముగ్గురంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
తను రాయలసీమ వాడినే అని చంద్రబాబు నాయుడు చెప్పుకున్నప్పటికీ సీమ ప్రజలు ఆయనను ఆదరించలేదు. కులాలకు, మతాలకు అతీతంగా రాయలసీమ ఏకతాటి మీద నిలబడి జగన్ కు జై కొట్టింది. మరి ఈ సమయంలో రాయలసీమను జగన్ ఆదరించాల్సిన అవసరం కూడా చాలానే ఉంది.
ఈ విషయాన్నే ప్రస్తావిస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే రాయలసీమ మేధావులు. పైనుంచి వస్తున్న భారీ వరదతో.. శ్రీశైలం డ్యామ్ నిండింది. ఆ ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని కిందకు వదులుతూ ఉన్నారు. శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టు ఉన్నది రాయలసీమలోనే అయినా నీటి కరువు కూడా అక్కడే ఉంది. సీమ లో స్టోర్ అయ్యే ఆ వాటర్ ఎక్కడెక్కడికో వెళ్తుంది. అయితే రాయలసీమకు మాత్రం అక్కడ నుంచి నీటి లభ్యత చాలా తక్కువ అని వారు వాపోతున్నారు.
ఇప్పుడు భారీగా నీటిని కిందికి వదులుతున్నా రాయలసీమ వైపుకు వదులుతున్న నీరు మాత్రం చాలా చాలా తక్కువే. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చినందుకు ఆనందపడాలో నీరంతా కిందకి వెళ్లిపోతుండటంతో బాధపడాలో అర్థం కావడం లేదని సీమ వాసులు వాపోతున్నారు.
ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి చెన్నైకి తాగునీరు అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. చెన్నైకి తాగునీటి కష్టాల నుంచి మీడియా ఇటీవలి కాలంలో బాగా హైలెట్ చేసింది. నిజమే అక్కడ కష్టాలు ఉంటే ఉండవచ్చు. అయితే ఇదే సమయంలో రాయలసీమ పరిస్థితి ఏమిటి? చెన్నై మీద సానుభూతితో జగన్ నీటిని వదలడానికి సానుకూలంగా స్పందించారు. మరి సీమ మీద సానుభూతి చూపేదెవరు? అని అంటున్నారు సీమ మేధావులు.
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు అందిన తరుణంలో అయినా సీమకు పుష్కలంగా నీటిని వదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాయలసీమలో ఈ సంవత్సరం వర్షాలు మరీ దారుణం. ఇప్పటికీ కనీస వర్షపాతం లేదు. కనీసం పంట సాగు చేయడానికి కూడా తగిన వర్షం పడలేదు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో కనిపిస్తున్న జలకళ సీమ వాసుల్లో ఆశలను రేపుతూ ఉంది. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించాలని.. సీమకు తగు న్యాయం చేయాలని ఆ ప్రాంత వాసులు కోరుతూ ఉన్నారు.
అయితే భారీ స్థాయిలో వరద ఇంకా కొనసాగుతూ ఉంది. దీంతో మరి కొన్ని రోజులు నిరాటంకంగా అన్ని వైపులకూ నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంది. ఆగస్టు రెండో వారంలోనే ఈ పరిస్థితి ఉంది. అక్టోబర్ వరకూ ఎగువన భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఇలాంటి నేపథ్యంలో వరద కొనసాగనుంది. కాబట్టి అన్ని ప్రాంతాల దాహార్తి తీర్చడానికి తగినట్టుగా నీటి లభ్యతకు అవకాశాలు ఏర్పడుతున్నాయని, పాలకుడిగా ఇది జగన్ కు కలిసి వచ్చే అంశమే.