Begin typing your search above and press return to search.
ఐవైఆర్ అలా చేశాడన్న రాయపాటి
By: Tupaki Desk | 22 Jun 2017 9:56 AM GMTఏపీ మాజీ సీఎస్.. ఇటీవల కాలంలో మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్న ఐవైఆర్ కృష్ణారావుపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ అధికారపార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు. బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి.. తీవ్ర విమర్శలకు గురి కావటంతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని పోగొట్టుకున్న ఆయనపై రాయపాటి ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. వేరే పార్టీ అడుగుజాడల్లో ఐవైఆర్ నడుస్తున్నారని చెప్పారు.
గతంలో ఐవైఆర్ గురించి తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం అందించానన్నారు. ఐవైఆర్ ఏదో పార్టీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పిన రాయపాటి.. రాజధానిగా అమరావతి ఏర్పాటును కూడా అడ్డుకోబోయారన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ఐవైఆర్ కృష్ణారావుకు వేల కోట్ల రూపాయిల విలువైన భూములు ఉన్నాయన్నారు. ఆయన ఆ భూముల్ని కొనుగోలు చేశారని ఆరోపించారు. అందుకే రాజధానిని దొనకొండకు తరలించేందుకు ప్రయత్నించినట్లుగా చెప్పారు అందుకే..రాజధానిని దొనకొండకు తరలించే ప్రయత్నం చేశారని.. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాశారన్నారు.
తనకు ఆ సమాచారం తెలిసి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ సమాచారాన్ని అందించినట్లుగా వెల్లడించారు. ఐవైఆర్ పుస్తకం రాస్తే చదవటానికి అదేమైనా రామాయణమా? మహాభారతమా? చదవటానికి అని ఎద్దేవా చేసిన ఆయన.. ఓసారి చూసి ప్రజలు పక్కన పెడతారన్నారు. రాయపాటి తీవ్ర ఆరోపణలకు ఐవైఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/