Begin typing your search above and press return to search.

షాక్: రాయపాటి కంపెనీ ఆస్తుల వేలం

By:  Tupaki Desk   |   26 July 2020 5:45 AM GMT
షాక్: రాయపాటి కంపెనీ ఆస్తుల వేలం
X
మాజీ ఎంపీ.. సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కు భారీ షాక్ తగిలింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రుణం తీసుకొని బాకాయిలు చెల్లించక ఎగ్గొట్టడంతో ఆ కంపెనీకి చెందిన ఆస్తులు వేలం వేస్తామని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.

ఏపీ, కర్ణాటక, తెలంగాణలో రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ.300 కోట్ల రుణం తీసుకుంది. సెంట్రల్ బ్యాంకుకు మొత్తం వడ్డీతో కలిపి అది రూ.452.41 కోట్ల బకాయిపడడంతో వేలం వేస్తున్నట్టు ప్రకటించారు.

రాయపాటి కంపెనీ ఈ 300 కోట్ల రుణం తీసుకొనేందుకు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తున్నామని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. వచ్చే నెల 18వ తేదిన వేలం వేస్తామని వేలంలో పాల్గొనేవారు 14వ తేదీలోపు బిడ్ దాఖలు చేయాలని గడువు విధించింది.

ఇక రాయపాటికి చెందిన వేరే ఇతర ఆస్తులను కూడా వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ కూడా కొద్దిరోజుల కిందట ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు నుంచి ట్రాన్స్ ట్రాయ్ ఇండియా, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మీ పేరుతో రుణం తీసుకున్నారు.