Begin typing your search above and press return to search.
ఏపీ కమలనాథులకు రాయపాటి వార్నింగ్
By: Tupaki Desk | 17 May 2016 9:49 AM GMTపార్టీ అధినాయకత్వం మనసు దోచుకునేలా మాట్లాడుతున్నారన్న ఆరోపణలున్న ఏపీ బీజేపీ నేతల వైఖరిపై టీడీపీ నేత.. ఎంపీ రాయపాటి ఫైర్ అయ్యారు. విభజన సందర్భంగా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై నాడు కాంగ్రెస్ అధినాయకత్వం మీద తీవ్రఆగ్రహాన్ని ప్రదర్శించి విమర్శలు చేసేందుకు వెనుకాడని రాయపాటి తాజాగా ఏపీ బీజేపీ నేతలపై తనదైన శైలిలోస్పందించారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గుస్సా అయిన ఆయన.. ఆయన మాటలు ఏ మాత్రం సరికావన్నారు.
అంతేకాదు.. ఏపీ సర్కారుకు బీజేపీ మిత్రపక్షమన్న విషయాన్ని మర్చిపోకూడదన్న ఆయన.. ఏపీ ప్రత్యేక హోదా విషయం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని తేల్చారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ రాజధాని కోసం ఏ రాష్ట్రం చేయనట్లుగా హడావుడి చేస్తుందని ఏపీ ముఖ్యమంత్రిపై సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేయటం.. రాజధాని కోసం లక్షల కోట్ల అవసరం ఏమిటని ప్రశ్నించటం తెలిసిందే.
తాజాగా రాయపాటి వ్యాఖ్యల్ని చూస్తే.. ఏపీ బీజేపీ నేతల ఏం మాట్లాడినా ఊరుకునేది లేదన్న విషయాన్ని తేల్చి చెప్పటంతో పాటు.. ఏపీ సర్కారుకు మిత్రపక్షమన్న విషయాన్ని గుర్తు చేయటం ద్వారా.. మిత్రధర్మాన్ని గుర్తు పెట్టుకొని మసలుకోవటం మంచిదన్న విషయాన్ని చెప్పారనుకోవాలి. ప్రధాని మోడీతో భేటీ నేపథ్యంలో.. ఏపీ ప్రత్యేక హోదా మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే.. ఏపీలో బీజేపీ.. టీడీపీ నేతల మధ్య ఓ స్థాయిలో మాటలయుద్ధం సాగుతున్నట్లుగా చెప్పాలి. మరి.. ఇదెంతవరకూ వెళుతుందో చూడాలి.