Begin typing your search above and press return to search.

పుట్టాకి టీటీడీ ఛైర్మ‌న్‌!..టీడీపీలో చిచ్చు!

By:  Tupaki Desk   |   1 Oct 2017 1:30 PM GMT
పుట్టాకి టీటీడీ ఛైర్మ‌న్‌!..టీడీపీలో చిచ్చు!
X
``నాకు కులంతో సంబంధం లేదు త‌మ్ముళ్లు! ప్ర‌జ‌లే నా కులం. అభివృద్ధే నా కులం`` అని తెగ నీతులు చెప్పే టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు సొంత పార్టీ నేత‌లే భారీ ఎత్తున షాక్ ఇస్తున్నారు. ఆయ‌న‌కు సొంత క్యాస్ట్ నుంచే సెగ‌లు ఆవిరి పుట్టిస్తున్నాయి. చంద్ర‌బాబుకు మేం ప‌నికిరామా? అంటూ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎంపీ ఒక‌రు దుయ్య‌బ‌డుతున్నారు. అంతేకాదు, డ‌బ్బు అవ‌స‌ర‌మైతే బాబుకు మేం క‌నిపిస్తామా? అని కూడా ఫైర‌వుతున్నారు. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌సిద్ధ‌ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి బోర్డు చైర్మ‌న్ ప‌ద‌విని క‌డ‌ప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ చేతిలో పెట్టారు బాబు.

ఈ ప‌రిణామం ఒక్క‌సారిగా టీడీపీలో మంట‌లు పుట్టించింది. బాబుకు అన్ని విధాలా తాము అండ‌గా ఉన్నామ‌ని, ఎంత డ‌బ్బు అంటే అంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టామ‌ని అయినా కూడా త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఏకంగా అధినాయ‌క‌త్వంపైనే టీటీడీ ప‌ద‌విని ఆశించిన గుంటూరు జిల్లా న‌ర‌సారావు పేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. బాబు పాల‌న‌లో క‌మ్మ వారికి స‌రైన గుర్తింపు లేద‌ని విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ...ఇప్పుడు కానీ బాబు క‌మ్మ‌ల‌కు ప్రాతినిధ్యం ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు.

నిజానికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం ఇద్ద‌రు ఎంపీలు గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. ఒక‌రు రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీ మోహ‌న్‌, రెండోవారు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు. టీటీడీ చైర్మ‌న్ గిరీ ఇస్తే.. త‌న ఎంపీ సీటుకు సైతం రాజీనామా చేసేందుకు రెడీ అంటూ రాయ‌పాటి బాంబు కూడా పేల్చారు. ఇక‌, ముర‌ళీ మోహ‌న్ తెర‌చాటుగా గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేశారు. అయితే, అనూహ్యంగా అప్ప‌టి వ‌ర‌కు పేరు కూడా ప‌రిశీల‌న‌లో లేని పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ కు సీఎం టీటీడీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. దీంతోఈ ప‌రిణామం నిపులు రాజేసింది. రాయ‌పాటి ఒక్క‌సారిగా అగ్గిమీద గుగ్గిలం మాదిరిగా మండిప‌డ్డార‌ట‌.

తాను కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన నాటి నుంచి పార్టీకి - కేడ‌ర్‌ కు ఎంతో ఖ‌ర్చు పెట్టాన‌ని, ఎంపీ సీటుకు సైతం రిజైన్ చేస్తాన‌ని చెప్పాన‌ని అయినా సీఎం త‌న‌ను ఖాత‌రు చేయ‌లేద‌ని ఆయ‌న త‌న అనుచ‌రుల వ‌ద్ద వాపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కులం కార్డు బ‌య‌ట‌కు తీసి మ‌రీ బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రి కులం అంటే చిరాక‌నే బాబు.. త‌న సొంత పార్టీ నేత‌లే కులం కార్డు ప‌ట్టుకుని చెడుగుడు ఆడుతుంటే.. మౌనంగా ఉండ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. నీతులు ప్ర‌జ‌ల‌కేనా..? సొంతానికి ప‌నిచేయ‌వా? అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.