Begin typing your search above and press return to search.
ఆ ముగ్గురు ఎంపీ ‘తమ్ముళ్ల’కు ఏమైంది?
By: Tupaki Desk | 3 Jan 2016 5:48 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబుబకు అత్యంత ఇష్టమైన కార్యక్రమాల్లో ఒకటైన జన్మభూమి కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. జన్మభూమి కారణంగా ప్రజలకు జరిగిన ప్రయోజనం కంటే కూడా..ఈ నినాదం పుణ్యంగా చంద్రబాబుకు రాజకీయంగా కలిసి వచ్చిందే ఎక్కువని చెప్పక తప్పదు. చంద్రబాబు మానసపుత్రిక అయిన జన్మభూమి కార్యక్రమాన్ని ఆయన ఎంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
శనివారం షురూ అయిన జన్మభూమి కార్యక్రమాన్ని ఏపీలోని 13 జిల్లాల్లో ఘనంగా స్టార్ట్ చేశారు. ఏపీ తమ్ముళ్లు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేశారు. కానీ.. గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలు మాత్రం జన్మభూమి కార్యక్రమానికి గైర్హాజరు కావటం గమనార్హం. శనివారం మొదలైన మూడో విడత జన్మభూమి కార్యక్రమానికి గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీలు రాయపాటి సాంబశివరావు.. గల్లా జయదేవ్.. మాల్యాద్రి ముగ్గరు డుమ్మా కొట్టటం ఆసక్తికరంగా మారింది.
అధినేతకు అత్యంత ఇష్టమైన జన్మభూమి కార్యక్రమానికి ముగ్గురు ఎంపీలు ఎందుకు హాజరు కానట్లు అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అధినేత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కార్యక్రమానికి హాజరు కాలేని పరిస్థితే ఉంటే.. ముందస్తుగా ప్రకటన ఇవ్వటం ద్వారా లేని పోని ప్రచారాలు జరగకుండా ఉండే వీలుంది. కానీ.. ఆ విషయాన్ని ‘‘ఎంపీ తమ్ముళ్లు’’ గుర్తించినట్లు లేదు.