Begin typing your search above and press return to search.

ఫస్ట్ కేసీఆర్.. నెక్ట్స్జ్ జగన్.. బాబే సాక్షి

By:  Tupaki Desk   |   16 Aug 2019 11:11 AM GMT
ఫస్ట్ కేసీఆర్.. నెక్ట్స్జ్ జగన్.. బాబే సాక్షి
X
తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చాపకింద నీరులా విస్తరిస్తున్న కేంద్రంలోని బీజేపీ వైఖరిపై ఆది నుంచి అనుమానాలే ఉన్నాయి.కానీ బీజేపీ ప్లాన్ ఏంటనేది మాత్రం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. అమిత్ షా తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారని.. ఆ తర్వాత ఏపీపై కూడా టీడీపీని దెబ్బకొట్టడానికి స్కెచ్ గీశారని వార్తలు వచ్చాయి..

అయితే ఇటీవలే బీజేపీలోకి వెళదామని ఆ పార్టీతో చర్చలు జరిపిన టీడీపీ నేతలకు ఈ విషయాలు అన్నీ తెలుసు. కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు. కాగా మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కూడా బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆయనే కాదు టీడీపీ నేతలెవరూ బీజేపీలోకి వెళదామనుకొని చేరలేదు..

తాజాగా రాయపాటి తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకొని హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీతో సాన్నిహిత్యం, తనకు తెలిసిన సమాచారం మేరకు బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పక్కా స్కెచ్ గీసిందని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఫస్ట్ కేసీఆర్ ను కూలదోస్తారని.. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ ను సాగనంపేలా ప్లాన్ రెడీ చేశారని.. బీజేపీ ప్లాన్ ఇదేనంటూ బాంబు పేల్చారు.

ఇక మరో విషయం కూడా చెప్పుకొచ్చారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుకు ఇదంతా తెలుసు అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అయినా ఆయన ఏమీ తెలియని వాడిలా ఉంటున్నారని చెప్పుకొచ్చారు.

గతంలో కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా.. అనంతరం సీనియర్ నేతగా ఢిల్లీలో పరిచయాలున్న వ్యక్తిగా రాయపాటి చేసిన ఈ కామెంట్లను కొట్టిపారేయలేం... అలాంటి నేత ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఇదేనంటూ వ్యూహాలను చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.