Begin typing your search above and press return to search.

రాయ‌పాటి గుడ్‌బై...ఏ పార్టీలో కంటే...

By:  Tupaki Desk   |   16 Aug 2019 5:09 PM GMT
రాయ‌పాటి గుడ్‌బై...ఏ  పార్టీలో కంటే...
X
ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన తెలుగుదేశం పార్టీకి మ‌రో ముఖ్య‌నేత గుడ్‌భై చెప్పే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. నరసరావుపేట తాజా మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు పార్టీకి గుడ్‌బై చెప్తార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు, మీడియాతో రాయ‌పాటి చేసిన వ్యాఖ్య‌లు దీనికి బ‌లం చేకూరుస్తున్నాయి. నవరత్నాలు పథకానికి నిధుల కొరత ఉందని.. అయితే కేంద్రం మాత్రం రాష్ట్రానికి సహకరించడం లేదని తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాయ‌పాటి కామెంట్ చేశారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ద‌ర్శించుకున్న అనంత‌రం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ జగన్ పరిపాలన చాలా బాగుందని ప్ర‌శంసించారు. నవరత్నాలు అమలు జరిగే ప్రజలు చేరువైతే ప్రజా నాయకుడిగా పేరు తెచుకుంటారని విశ్లేషించారు. జగన్ పథకాలకు నిధుల కొరత ఉందని, కేంద్ర ప్రభుత్వం జగన్ సర్కారుకు సహకరించడం లేదని అన్నారు. రాయ‌పాటి ఈ కామెంట్లు చేయ‌డంతో ఆయ‌న‌ పార్టీ మార‌నున్నార‌ని అంచ‌నా వేస్తున్నారు.

రాయ‌పాటిపార్టీమారితే బీజేపీ చేర‌డం కంటే వైసీపీని ఎంచుకుంటార‌నే చ‌ర్చ తాజా కామెంట్ల‌తో అర్థ‌మ‌వుతోంది. బీజేపీ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోందని, అది సాధ్యం అయ్యే పనికాదని రాయపాటి అన్నారు. తాను ఏ పార్టీలో చేరాలనే అశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని రాయపాటి ఈ సందర్భంగా తెలిపారు. పార్టీ మార్పు గురించి త్వరలోనే మాట్లాడతానని చెప్పారు.

కాగా ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో పార్టీలో పీట‌ముడి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ సీటును సిట్టింగ్ ఎంపీ రాయ‌పాటి ఆశించ‌గా...టీడీపీ అధ్య‌క్షుడు, సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కు భ‌రోసా ఇవ్వ‌లేదు. అనంత‌రం బాబుతో స‌మావేశం అవ‌గా...అప్పుడు భ‌రోసా ద‌క్కింది. అయితే, ఆ ఎన్నిక‌ల్లో రాయ‌పాటి ఓట‌మి పాల‌య్యారు.