Begin typing your search above and press return to search.

రాయపాటి.. ఈ కమ్మ గోలేంది?

By:  Tupaki Desk   |   16 April 2020 5:15 AM GMT
రాయపాటి.. ఈ కమ్మ గోలేంది?
X
దేనికైనా సమయం.. సందర్భం అన్నది ఉంటుంది. అందుకు భిన్నంగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ఏపీ సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరుగా చెప్పుకునే రాయపాటి సాంబశివరావు లాంటి వారి నోటి నుంచి వస్తున్న మాటలు వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఓవైపు కరోనా మహమ్మారిని నియంత్రించే పనిలో ప్రభుత్వాలు మునిగిపోతే.. వారికి సహకరిస్తూ ప్రతిపక్షాలు మౌనంగా ఉంటున్నాయి. చిల్లర రాజకీయాల్ని పక్కన పెట్టేసి కామ్ గా ఉంటున్న దానికి భిన్నంగా రాయపాటి మాటలు ఉన్నాయని చెబుతున్నారు.
ఎక్కడా లేనంత దరిద్రంగా కుల రాజకీయాల్ని జరిపే ఏపీలో.. రాయపాటి వారి నోటి నుంచి షాకింగ్ వ్యాఖ్యలు వచ్చాయి. సీఎం జగన్ ను ఉద్దేశించి ఏదైనా వ్యాఖ్యలు చేయాల్సి వస్తే.. అంతవరకూ పరిమితం చేయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా అవసరం లేని కుల ప్రస్తావన తీసుకురావటం గమనార్హం.

కమ్మవాళ్లు ఏం చేస్తారని జగన్ అనుకుంటున్నారు. కమ్మోళ్లు ఇట్టా తిప్పితే చాలు అయిపోతాడంటూ రాయపాటి చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సబబుగా లేవంటున్నారు. జగన్ పాలనను ఉద్దేశించి విమర్శలు చేయాల్సి వస్తే చేయొచ్చు. కానీ.. కులాల కుంపట్లు రగిల్చేలా రాయపాటి మాటలు ఉన్నాయని చెప్పాలి. కరోనా తీవ్రత తగ్గాక తాను ప్రధాని మోడీని కలుస్తానని చెప్పిన ఆయన.. అమరావతి అంశం గురించి మాట్లాడతానని చెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు రియల్ ఎస్టేట్ చేయటానికి అమరావతిలో అవకాశం లేకపోవటంతో సంపాదించుకోవటానికే వైజాగ్ వెళుతున్నారన్నారు. పోస్టింగుల్లో ఎంతమంది రెడ్లు ఉన్నారు? ఎస్పీలు.. ఐజీలు.. సీఐలు ఎంతమంది ఉన్నారు? అంటూ ప్రశ్నించిన ఆయన.. తానున్న గుంటూరు జిల్లాలోనే దాదాపు 300 మంది ఎస్ఐలు.. సీఐలు.. డీఎస్పీలు పోస్టింగులు రాకుండా.. జీతాలు లేకుండా బాధ పడుతున్నట్లు చెప్పారు.

ఒక్క కమ్మ ఎస్ఐకి కానీ.. సీఐకి కాని పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. కమ్మవాళ్లు ఏం చేస్తారని ఆయన అనుకుంటున్నారని.. అది తప్పుగా చెప్పారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కమ్మ అని అంటున్నారు. ఆయన కానీ ఎన్నికలు ఆపకుంటే వేలాది మంది చనిపోయేవారు? అంటూ ప్రశ్నించారు. కమ్మ అంటే చాలు.. తీసి పారేయాలని అంటున్నారని.. కమ్మవారికి సాయం కూడా చేయొద్దని ఎస్పీకి ఫోన్ చేసిన చెప్పినట్లుగా ఆరోపించారు. సున్నితమైన కులాల అంశాన్ని తెర మీదకు తెచ్చేటప్పుడు సరైన ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటంలో అర్థం లేదు. అందునా.. కరోనా టైంలో ఇలాంటి అనవసరమైన వ్యాఖ్యలతో రాజకీయ కాలుష్యం తప్పించి మరెలాంటి ప్రయోజనం ఉండదు కూడా. ఈ విషయం రాయపాటి వారికి ఎందుకు తెలీటం లేదు?