Begin typing your search above and press return to search.
పార్లమెంట్ భవన్ బానిస చిహ్నమా?
By: Tupaki Desk | 22 Feb 2016 7:29 AM GMTవివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే నేతల్లో ముందుండే నేత యూపీ మంత్రి.. సమాజ్ వాదీకి చెందిన సీనియర్ నేత ఆజమ్ ఖాన్. తనకు తోచిన వ్యాఖ్యల్ని ఎలాంటి జంకూబొంకూ లేకుండా చేసే ఆయన తాజాగా మరో తీవ్రమైన వ్యాఖ్యను చేశారు.
దేశ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా భావించే పార్లమెంట్ హౌస్ ను కూల్చేయాలని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. పార్లమెంట్ భవన్ తో పాటు.. అదే చేత్తో రాష్ట్రపతి భవన్ ను కూడా కూల్చేయాలని.. అవన్నీ బానిసత్వానికి ప్రతీకలుగా ఆయన పేర్కొంటున్నారు.
రాంపూర్ లోని ఒక కాలేజీలో జరిగిన సెమినార్ లో ప్రసంగించిన ఆయన.. బ్రిటీషోళ్లు నిర్మించిన భవనాలన్నీ బానిసత్వ చిహ్నాలుగా పేర్కొన్నారు. గతంలో తాజ్ మహాల్ ను కూల్చేసి శివాలయాన్ని నిర్మించాలంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరి.. బ్రిటీషోళ్లు కట్టినవన్నీ బానిస చిహ్నాలంటే.. వారు నిర్మించిన ప్రాజెక్టులు.. రైల్వే లైన్ల సంగతేంటి? విధ్వంసం తప్పించి.. మరో ఆలోచనలేని ఆజంఖాన్ లాంటి నేతలు ఉండటం దేశం చేసుకున్న దౌర్భాగ్యమా?