Begin typing your search above and press return to search.

పాత నోట్లు డిపాజిట్ చేసే ఎన్నారైల‌కు కొత్త ట్విస్ట్‌!

By:  Tupaki Desk   |   2 Jan 2017 2:21 PM GMT
పాత నోట్లు డిపాజిట్ చేసే ఎన్నారైల‌కు కొత్త ట్విస్ట్‌!
X
పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుని 50 రోజులు దాటిపోయిన సంగ‌తి తెలిసిందే. గ‌డ‌చిన యాభై రోజుల్లోనూ పాత నోట్ల‌ను డిపాజిట్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. ఎన్నో ప‌రిమితుల మ‌ధ్య‌లో బ్యాంకులు డిపాజిట్లు స్వీక‌రించాయి. ఇప్పుడు యాభై రోజులు గ‌డిచిన త‌రువాత కూడా కొన్ని ప‌రిమితుల మ‌ధ్య ఆర్బీఐ శాఖ‌ల‌కు వెళ్లి డిపాజిట్ చేసుకునే సౌక‌ర్య‌మూ ఉంది. విదేశాల్లో ఉంటున్న భార‌తీయులూ ఎన్నారైలు పాత నోట్లు డిపాజిట్ చేసుకోవ‌డానికి జూన్ వ‌ర‌కూ గ‌డువు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ఎన్నారై డిపాజిట్ల‌పైనే మ‌రో కొత్త నిబంధ‌న తీసుకొచ్చింది. ఈ మేర‌కు ఆర్థిక శాఖ ఒక ప్ర‌క‌ట‌నను విడుద‌ల చేసింది.

విదేశాల నుంచీ పాత నోట్లు త‌మ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు వ‌చ్చేవారు ఓ ధ్రువ ప‌త్రంతో రావాలి. విదేశాల నుంచి తాము తీసుకొస్తున్న పాత నోట్ల‌ను ముందుగా విమానాశ్ర‌యంలోనే అక్క‌డి అధికారుల‌కు చూపించాల్సి ఉంటుంది. తీసుకొచ్చిన పాత నోట్ల‌ను క‌స్ట‌మ్స్ అధికారుల‌కు చూపించి, వారి నుంచి ఒక ప్ర‌త్యేక అనుమ‌తి ప‌త్రం పొందాలి. భార‌తదేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు జ‌రిగిన స‌మ‌యంలో తాము విదేశాల్లోనే ఉన్నామ‌ని నిరూపించుకోవాల్సి వ‌స్తుంది. అలాగే, గ‌తంలో ఇదివ‌ర‌కూ తాము పాత నోట్ల‌ను ఏ బ్యాంకు శాఖ‌ల్లోనూ మార్చుకోలేద‌ని కూడా ప‌త్రాల్లో చూపించాల్సి ఉంటుంది. ఈ ప‌త్రాల‌న్నింటినీ సొమ్ము డిపాజిట్ స‌మ‌యంలో ఆర్బీఐ శాఖ‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఫెమా చ‌ట్టం ప్ర‌కారం ఎన్నారైల‌కు ఒక్కొక్క‌రు రూ. 25 వేల ప‌రిమితి ఉంటుంది. అర్హులైన ఇండియ‌న్స్ కి ఎంత సొమ్మైనా మార్చుకునే అవ‌కాశం ఉంటుంది.

నిజానికి, ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌కొత్త నిబంధ‌న‌లు తీసుకురావ‌డం అనేది కొత్తం కాదు. న‌వంబ‌ర్ 8న పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టించిన ద‌గ్గ‌ర నుంచీ రోజుకో మార్పు ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు. ప్ర‌జ‌ల‌ను తీవ్ర గంద‌ర‌గోళానికి గురిచేశారు. క్యాష్ డిపాజిట్ల విష‌యంలో ర‌క‌ర‌కాల కండిష‌న్లు పెట్టారు. మొద‌ట్లో క్యాష్ మార్పిడి అవ‌కాశం ఇచ్చిన‌ట్టే ఇచ్చీ... త‌రువాత ఎత్తేశారు. ఇలా ఒక‌ట‌నేంటి చాలా మార్పులు చేశారు. ఇప్పుడు ఎన్నారైల విష‌యంలో జ‌రుగుతున్న‌దీ అదే. ఇవాళ్లో కొత్త స‌వ‌ర‌ణ వ‌చ్చింది, రేపు రాద‌ని చెప్ప‌లేం... డీమాన‌టైజేష‌న్ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం తీరు అలా మారిపోయింది మ‌రి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/