Begin typing your search above and press return to search.

నిండా ముంచేస్తాయి.. బ్యాంక్‌యాప్‌లతో జాగ్రత్త!

By:  Tupaki Desk   |   12 April 2015 6:32 AM GMT
నిండా ముంచేస్తాయి.. బ్యాంక్‌యాప్‌లతో జాగ్రత్త!
X
ప్రస్తుతం సకలం స్మార్ట్‌ఫోన్‌ మయం అయిపోయింది. ప్రతిదానికీ స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. ఇవన్నీ జీవితాన్ని సౌకర్యమంతం చేస్తున్న మాట వాస్తవమే కానీ.. ఇలాంటి విషయాల్లో కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రత్యేకించి బ్యాంకింగ్‌ అప్లికేషన్‌లను వాడుతున్న వారు, వాడాలనుకొంటున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వయంగా ఆర్‌బీఐ ఈ హెచ్చరికను జారీ చేసింది.

ఈ మధ్య వాట్సప్‌లో బ్యాంకింగ్‌ యాప్‌ అంటూ ఒక షేర్‌ అవుతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ 'ఆల్‌ బ్యాంక్‌ ఎంక్వైరీ' పేరుతో ఒక యాప్‌ను రూపొందించిందని.. ఏ బ్యాంక్‌లో ఖాతా కలిగి ఉన్నవారైనా ఆ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చనేది ఆ మెసేజ్‌ సారాంశం.

అయితే తాము ఎలాంటి అప్లికేషన్‌నూ రూపొందించలేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. వాట్సప్‌లో షేర్‌ అవుతున్న విషయాన్ని నమ్మవద్దని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

కేవలం ఈ ప్రచారంలో ఉన్న అప్లికేషన్‌ విషయంలోనే కాకుండా.. మొత్తంగా అన్ని బ్యాంకింగ్‌ అప్లికేషన్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు ఆర్‌బీఐ సూచించింది. నకిలీ యాప్‌లను నమ్మి ఇన్‌స్టాల్‌ చేసుకొని.. ఖాతా వివరాలను వాటికి అందజేయడం ద్వారా నిండా మునిగే అవకాశాలున్నాయి జాగ్రత్త అని ఆర్‌బీఐ హెచ్చరించింది.

అయితే బ్యాంకుల ధ్రువీకరణ పొందిన అప్లికేషన్లు ఉన్నాయి. ఎస్‌బీఐ ఫ్రీడమ్‌ తరహా అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఆ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకొన్నా వాటిలాగిన్‌ ఐడీలు మాత్రం బ్యాంక్‌ బ్రాంచుల్లోనే లభిస్తాయి. బ్యాంక్‌ అధికారుల సమక్షంలో వాటిని ఇన్‌స్టాల్‌ చేసి లాగిన్‌ అయితే.. ఎంచక్కా స్మార్ట్‌ఫోన్‌ నుంచినే అకౌంట్‌ అపరేషన్లను నిర్వహించుకోవచ్చు.