Begin typing your search above and press return to search.
బ్యాంకు లోన్ పై మారిటోరియం తీసుకున్నారా? మీ మీద పడే భారం ఎంతంటే?
By: Tupaki Desk | 13 Jun 2020 11:30 PM GMTఊహించని రీతిలో మీద పడిన మాయదారి రోగం వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరి మీదా పడుతోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్ లో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దీంతో.. రెండు నెలలకు పైనే లాక్ డౌన్.. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పలు పరిణామాలతో అన్ని రకాల వ్యాపారస్తులతో పాటు.. వివిధ వర్గాలకు చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు.
దీంతో.. బ్యాంకుల్లో తీసుకున్న అన్ని రకాల రుణాలను తిరిగి చెల్లించే విషయంలో ఆర్ బీఐ తొలుత మూడు నెలల మారిటోరియం.. అనంతరం మరో మూడు నెలల మారిటోరియంను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకున్న రుణాలకు సంబంధించిన వాయిదా మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశం లేని చాలామంది ఆర్ బీఐ ప్రకటించిన మారిటోరియంను వినియోగించకుంటున్నారు. అయితే.. దీని భారం భారీగా ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
సాంకేతికంగా దీని భారం ఏ స్థాయిలో ఉంటుందన్న విషయాన్ని చూస్తే.. కళ్లు తిరగక మానవు. ఆర్థిక నిపుణులు వేసిన అంచనా ప్రకారం పదిహేనేళ్ల వ్యవధికి రూ.30లక్షలు రుణాన్ని ఇంటి కోసం ఒకరు తీసుకున్నారనుకుందాం. 8.4 శాతం వడ్డీకి ఈ రుణాన్ని తీసుకుంటే.. ప్రతి నెల చెల్లించాల్సిన ఈఎంఐ రూ.29,367 ఉంటుంది. ఒకవేళ మారిటోరియంను తీసుకుంటే.. ఈ వ్యవధిలో చెల్లించాల్సిన ఈఎంఐ మీద వడ్డీ రూ.1,26,000 వస్తుంది. అప్పుడు మొత్తం అప్పు రూ.31.26లక్షలు అవుతుంది.
ఇటీవల వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్ బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 8 శాతానికి తగ్గించినా నెలకు రూ.29,367 చొప్పున చెల్లించాల్సిన మొత్తం 180నెలలకు మరో పదహారునెలలు అదనంగా కలవటం ఖాయం. ఒకవేళ జాతీయ బ్యాంకుల నుంచి కాక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని తీసుకుంటే.. ఈ భారం మరింత పెరిగే వీలుందని చెబుతున్నారు.
మారిటోరియం తీసుకోవటం ద్వారా తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ.. దీర్ఘకాలంలో మాత్రం భారంగా మారటం ఖాయం. ఈ కారణంతోనే దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రుణాలు తీసుకున్న వారిలో మారిటోరియం సదుపాయాన్ని కేవలం 21.8 శాతం మంది మాత్రమే ఎంచుకున్నట్లు చెబుతున్నారు. దీనికి కారణంగా వడ్డీ బాదుడు భారీగా ఉండటమే. మారిటోరియంను ఓకే చేయటమంటే.. భారీ భారానికి సిద్ధం కావాల్సిందేనన్న విషయాన్ని మర్చిపోకూడదు.