Begin typing your search above and press return to search.

కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.57వేల కోట్లు

By:  Tupaki Desk   |   14 Aug 2020 5:00 PM GMT
కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.57వేల కోట్లు
X
కరోనా కష్టకాలంలో మోడీ సర్కార్ గొప్ప ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.57వేల కోట్ల మిగులు నిధులు బదిలీ చేసేందుకు కేంద్రం సిద్దమైంది.

2019-20 అకౌంటింగ్ సంవత్సరంలో తమ వద్ద మిగిలిన రూ.57,128 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఆర్బీఐ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది.

తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో జరిగిన సెంట్రల్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డివెడెంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఈ నిధులు ఇవ్వనుంది.

కరోనాతో ఆదాయం పడిపోయిన నేపథ్యంలో ఈ నిధులు కేంద్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతాయి.