Begin typing your search above and press return to search.
మోడీ గురించి మాత్రం మాట్లాడరంట
By: Tupaki Desk | 11 Aug 2016 5:56 PM GMTమాట్లాడే ఒకటీ అరా మాటలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించే సత్తా ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మాటలకుంది. తన విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేసిన ఆయనకున్న ‘కాంగ్రెస్’ ముద్ర మోడీ పరివారానికి నచ్చనిది. అందుకే.. సమర్థుడైనప్పటికీ రఘురాంరాజన్ ను కొనసాగించటానికి కమలనాథులకు ఏ మాత్రం ఇష్టం లేని పరిస్థితి.అందుకే.. పొమ్మనకుండా పొగబెట్టే రీతిలో బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సీన్లోకి రావటం.. అనాల్సిన మాటల్ని అనేయటం.. వెళ్లిపోవటం తప్ప పదవిలో ఉండేందుకు ఏ మాత్రం అవకాశం లేని వాతావరణాన్ని సృష్టించటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.
అందుకేనేమో రాజన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ మౌనంగా ఉన్న ప్రధాని మోడీ.. తర్వాత మాత్రం కాస్త ప్యాచప్ చేసే మాటలు నాలుగు చెబుతూనే.. ఆయన్ను సాదరంగా సాగనంపేందుకు అవసరమైన మాటల్ని చెప్పేశారు.రాజన్ ఈ దేశ పౌరుడని.. ఆయన్ను అనుమానించాల్సిందేమీ లేదంటూ కంటితుడుపు మాటలే తప్పించి.. ఆయనలాంటి సమర్థుడి సేవల్ని తమ ప్రభుత్వం వినియోగిస్తుందన్న మాటను మాత్రం చెప్పలేదు.
మోడీ మాటలతో రాజన్ ఎగ్జిట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆర్ బీఐ గవర్నర్ గా పదవీ విరమణ చేసిన తర్వాత తనకెంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిలో సాగుతానని చెప్పిన రాజన్.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆర్ బీఐ గవర్నర్ గా పదవిని వీడే సమయం దగ్గర పడుతున్న సమయంలో పలు మీడియా సంస్థలకు ఆయనిస్తున్న ఇంటర్వ్యూలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. చర్చకు రేపేలా ఉంటున్నాయి. నిన్నటికి నిన్న ఒక జాతీయ ఛానల్ తో మాట్లాడిన రాజన్.. తాజాగా బీబీసీతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు రాజన్ చెప్పిన సమాధానం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మోడీ పాలన మీద స్పందించమని కోరిన ప్రశ్నకు.. దానికి తాను సమాధానం చెప్పలేనని.. తాను సమాధానం చెబితే అది ‘‘ప్రాబ్లమేటిక్’’ అవుతుందని వ్యాఖ్యానించటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తోంది. ‘‘నేనీ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పదలుచుకోలేదు. నేనేం చెప్పినా అది సమస్యాత్మకమే అవుతుంది. నేనీ ప్రశ్నకు దాటేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. రాజన్ తాజా సమాధానంతో మోడీ గురించి రాజన్ మనసులో ఏం ఉంది? ఆయనేం చెబితే.. అదెందుకు సమస్యాత్మకంగా మారుతుంది? ఎందుకు? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే తన ఇంటర్వ్యూను ముగించారు. ఇంతకూ మోడీ గురించి రాజన్ ఎందుకు మాట్లాడరు..?