Begin typing your search above and press return to search.
ఈసారి ఆర్థిక సంక్షోభం వాటితోనే.. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 23 Dec 2022 6:35 AM GMTరష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాలు, గత రెండేళ్లు కోవిడ్ కల్లోలంతో అస్తవ్యస్తమైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితర కారణాలతో ప్రపంచం మళ్లీ ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం మొదలైందని స్పష్టం చేస్తున్నారు. అయితే మాంద్యం ముప్పును ఎదుర్కోగల సత్తా భారత్ కు ఉందని వివిధ అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఈసారి ఆర్థిక సంక్షోభానికి క్రిప్టో కరెన్సీ కారణమవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సమావేశంలో మాట్లాడుతూ శక్తికాంత్ దాస హాట్ కామెంట్స్ చేశారు.
క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని శక్తికాంత్ దాస తన అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీని పెరగడానికి అనుమతిస్తే ఇది ఆర్థిక సంక్షోభానికి కారణం కావడం ఖాయమని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. గతంలోనూ శక్తికాంత్ దాస క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని వ్యాఖ్యలు చేశారు.
చాలామంది సరైన అవగాహన లేక క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారని శక్తికాంత్ దాస ఆవేదన వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీల సంస్థలు రిజర్వ్ బ్యాంక్‌లాంటి సంస్థలను ఏమాత్రం విశ్వసించవని తెలిపారు. అంతేకాకుండా సెంట్రల్ బ్యాంకులను పరిగణనలోకి తీసుకోకుండా వాటిని దాటి ముందుకు వెళ్లాలని చూస్తాయని చెప్పారు.
అమెరికాలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్.. ఎఫ్‌టీఎక్స్ దివాలా తీయడమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. నవంబరులో దివాలా తీయడానికి ముందు ఎఫ్‌టీఎక్స్ 32 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఎక్సేంజ్ గా ఉందని శక్తికాంత్ దాస తెలిపారు. అలాగే ఇతర ప్రైవేటు క్రిప్టో కరెన్సీల విలువ 190 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు తగ్గిపోయిందన్నారు. అందువల్ల వచ్చే ఆర్థిక సంక్షోభం క్రిప్టో కరెన్సీల వల్లే వస్తుందని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా వాటిని నిషేధించాలన్నదే తన అభిప్రాయమని స్పష్టం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.