Begin typing your search above and press return to search.
జైట్లీ నోట రూ.5వేలు.. రూ.10వేల నోట్ల మాట
By: Tupaki Desk | 13 Nov 2016 4:57 AM GMTఇంతకాలం చెలామణిలో ఉన్న రూ.వెయ్యి రూపాయి నోటుకే చిల్లర కష్టాలతో వ్యాపారులు కిందామీదా పడే పరిస్థితి. ఆ రూ.వెయ్యినోటును రద్దు చేసి.. దాని స్థానే రూ.రెండు వేల నోటును తీసుకురావటం తెలిసిందే. ప్రస్తుతం ప్రజలు ఈ నోట్లను వినియోగిస్తున్నా.. వ్యాపారులు మాత్రం వీటిని తీసుకోవటానికి పెద్దగా ఆసక్తిని ప్రదర్శించటం లేదు. ఎందుకంటే.. రూ.2వేల నోటు తీసుకుంటే.. సదరు వినియోగదారులు కొన్న దానికి తిరిగి చెల్లించటానికి భారీ మొత్తంలో చిల్లర నోట్లు ఇవ్వాల్సి రావటమే. ప్రస్తుతం రూ.2 వేల నోటు తర్వాత చెల్లుబాటులో ఉన్న నోటు రూ.వంద మాత్రమే. కనీసం రూ.500నోట్లు చెలామణిలో ఉన్నా చిల్లర ఇచ్చేయటం కష్టంగా ఉండేది కాదు. కానీ.. వందరూపాయిల నోటు మాత్రమే ఉన్న నేపథ్యంలో రూ.2వేల నోటు తీసుకోవటానికి కాస్త ముందువెనుకా ఆలోచిస్తున్న పరిస్థితి.
రూ.2వేల నోటుకే పరిస్థితి ఇలా ఉంటే.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన ఒక మాట ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఆర్ బీఐ చెప్పిన మాటను కేంద్రం కానీ ఓకే చేసి ఉంటేనా? అన్న ఆలోచన రావటానికే జంకే పరిస్థితి. ఎందుకంటే.. పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను చెల్లుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్న కేంద్రం.. దీనికి సంబంధించి ఆర్ బీఐ సలహాను కోరినప్పుడు.. వారు కొత్తగా 5వేలు.. 10వేల రూపాయిల కొత్త నోట్లను తీసుకురావాలని ప్రతిపాదించినట్లుగా జైట్లీ వెల్లడించారు.
ఆర్ బీఐ చేసిన ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చిందని చెప్పుకొచ్చారు. ఆర్ బీఐ చేసిన ప్రతిపాదన స్థానే.. రూ.2వేల నోటుకు కేంద్రం ఆమోదముద్ర వేసినట్లుగా వెల్లడించారు. పాతనోట్ల చెలామణిపై మినహాయింపులు ఇవ్వాలని పలువురు కోరుతున్నారని..అందులో రైతులు.. దేవాలయాలు.. టీ ఫ్లాంటేషన్ వర్కర్లు ఇలా ఉన్నారని.. అందరి వినతుల్నిఆమోదిస్తూ పోతే.. పాతనోట్లను రద్దు నిర్ణయం కారణంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని జైట్లీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి.. ఆర్థికమంత్రి.. ఆర్థిక శాఖలోని ఒకరిద్దరు ఉన్నత అధికారులకు మినహా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎవరికీ తెలీదని జైట్లీ స్పష్టం చేశారు.
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పలు సమస్యలు తెర మీదకు వస్తున్న తరుణంలో జైట్లీ కొన్ని అంశాల మీద స్పందించారు. వాటిని చూస్తే.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రం ఎలా ఆలోచిస్తుందో ఇట్టే తెలుస్తుంది.
= కొత్తగా ముద్రించిన నోట్లను ఎటీఎంలలో పెట్టాలంటే ఆ మెషిన్లకు పలు మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కనీసం 20 రోజులు పడుతుంది.
= కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలలో మార్పులు చేసే వరకూ వంద రూపాయిల నోట్లు మాత్రమే ఎటీఎంలలో వస్తాయి.
= పెద్ద నోట్ల రద్దు విషయాన్ని రహస్యంగా ఉంచేందుకే దేశ వ్యాప్తంగా ఉన్న ఎటీఎంలలో మార్పులు చేయలేదు.
= పాత నోట్లను మార్చుకునే విషయంలో ప్రజలు హడావుడికి గురి కావాల్సిన అవసరం లేదు. డిసెంబరు 30 వరకు వాటిని మార్చుకునే వీలుంది.
= నగదు రహిత లావాదేశీలపై సర్ చార్జీ రద్దు చేయాలన్న అంశంపై ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/