Begin typing your search above and press return to search.

పేరుకు పావుశాత‌మే..ప‌డే భారం ఎక్కువే..!

By:  Tupaki Desk   |   2 Aug 2018 4:57 AM GMT
పేరుకు పావుశాత‌మే..ప‌డే భారం ఎక్కువే..!
X
నిన్న‌టి ప్ర‌ధాన వార్త‌లు చూస్తే.. ఒక వార్త ద‌గ్గ‌ర చాలామంది క‌ళ్లు ఆగిపోతాయ్. పావుశాతం వ‌డ్డీ రేటు పెంచుతూ భార‌త రిజ‌ర్వ్ బ్యాంక్ నిర్ణ‌యం తీసుకుంద‌ని.. ఈ మ‌ధ్య‌నే పావు శాతం పెంచిన ఆర్ బీఐ.. తాజాగా మ‌రోసారి పావు శాతం పెంచ‌టం కార‌ణంగా ఇళ్లు.. కొత్త వాహ‌నాలు తీసుకోవాల‌ని భావించే వారి మీద భారం అధికంగా ప‌డుతుంద‌న్న అభిప్రాయం ఉంది.

పేరుకు పావుశాత‌మే అయినా.. దాని ప్ర‌భావం ఎక్కువే ఉంటుంద‌న్న మాట నిపుణులు లెక్క క‌ట్టి మ‌రీ చూపిస్తారు. రిజ‌ర్వ్ బ్యాంక్ పెంచిన వ‌డ్డీ రేటు పెంపు పుణ్య‌మా అని స‌గ‌టు జీవిపై ప‌డే భారం లెక్క వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. పాతిక బేసిక్ పాయింట్ల విలువ ఇంత ఎక్కువ‌గా ఉంటుందా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

ఆర్ బీఐ పెంచిన వ‌డ్డీ రేట్ల కార‌ణంగా.. ఫ్లాట్ (స్థిర‌) ఇంట్ర‌స్ట్ మీద రుణం తీసుకుంటే ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు. అదే.. ఫ్లోటింగ్ (చ‌ల‌న‌) రేటుతో రుణం తీసుకున్న వారిపై మాత్రం ప్ర‌భావం ప‌డ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజా పెంపును 20.. 25 ఏళ్ల‌కు రుణాలు తీసుకునే వారి మీద ప‌డే భారం ల‌క్ష‌ల రూపాయిల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం.

రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో 50 బేసిక్ పాయింట్లు పెరిగిన వ‌డ్డీ రేటు కార‌ణంగా.. బ్యాంకు రుణాలు తీసుకున్న‌వారిపై ప‌డే భారాన్ని లెక్క వేస్తే.. దీని ప్ర‌భావం ఎంతో అర్థ‌మ‌వుతుంది. 8.5 వ‌డ్డీ రేటులో ల‌క్ష రూపాయిల రుణాన్ని 20 ఏళ్ల‌కు తీర్చే ఒప్పందం మీద బ్యాంకు ద‌గ్గ‌ర నుంచి అప్పు తీసుకున్నామ‌నుకోండి. వ‌డ్డీ.. అస‌లు క‌లిపి ప్ర‌తి నెల రూ.868 ఇన్ స్టాల్ మెంట్ ఉంటుంది.

వ‌డ్డీ రేటు కాస్తా 8.75 శాతానికి పెరిగింద‌నుకోండి.. చెల్లింపుల భారం రూ.900ల‌కు పెరుగుతంది. వ‌డ్డీ రేట్లు పెరిగిన ప్ర‌తిసారీ.. ఈ భారం అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొత్త‌గా రుణాలు తీసుకోవాల‌నుకున్న వారికి.. వ‌డ్డీ రేట్ల పెంపు కార‌ణంగా ఇచ్చే రుణ మొత్తం త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంటుంది.

మ‌రింత వివ‌రంగా చెప్పాలంటే.. రూ.30 ల‌క్ష‌ల రుణాన్ని 20ఏళ్ల కాల ప‌రిమితికి బ్యాంకు ద‌గ్గ‌ర ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు (8.65 శాతం) తీసుకున్నార‌నుకోండి. నెల‌స‌రి క‌ట్టాల్సిన వాయిదా మొత్తం రూ.26,320గా ఉంటుంది. పెరిగిన వ‌డ్డీ రేటును ప్రాతిప‌దిక‌గా తీసుకుంటే.. ఈ మొత్తం కాస్తా రూ.26,799 గా మార‌తుంఉది. మొత్తం వ‌డ్డీ రూ.33,16,850 అయితే.. పెరిగిన వ‌డ్డీ రేటు కార‌ణంగా చెల్లించాల్సిన మొత్తం రూ.34,31,794 అవుతుంది. అంటే.. పావుశాతం వ‌డ్డీ రేటు పెంపున‌కు ప‌డే వ‌డ్డీ భారం ఏకంగా రూ.1,14,944 అవుతుంది. అప్పుగా తీసుకునే మొత్తం పెరిగే కొద్దీ.. ఈ భారం అంత‌కంత‌కూ పెరుగుతూ ఉంటుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.